సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్, దిమ్మ‌తిరిగే యాక్ష‌న్.. స్ట్రీట్‌ఫైట‌ర్ ట్రైల‌ర్ అదిరింది

ABN, Publish Date - Apr 17 , 2026 | 12:07 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రించేందుకు ఓ భారీ హాలీవుడ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌, కామెడీ చిత్రం స్ట్రీట్‌ఫైట‌ర్ (Street Fighter) సిద్ధం అవుతోంది.

Street Fighter,

ప్ర‌పంచ వ్యాప్తంగా యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రించేందుకు ఓ భారీ హాలీవుడ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌, కామెడీ చిత్రం స్ట్రీట్‌ఫైట‌ర్ (Street Fighter) సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌సిద్ది చెందిన క్యాప్కామ్ వీడియో గేమ్ సిరీస్ ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులోని ఫైటింగ్, యాక్షన్, ఐకానిక్ క్యారెక్టర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు దానిని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

గ‌తంలోనే 1994లో స్ట్రీట్ ఫైట‌ర్ పేరుతో ఓ మూవీ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ నేటి ట్రెండ్‌కు అనుగుణంగా అత్యాధునిక టెక్నాల‌జీ, పాత్ర‌లు, గేమ్స్ వంటి వాటిపై ప్ర‌త్యేక దృష్టి సారించి కొత్త వెర్ష‌న్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ సినిమా ద‌స‌రా స‌మ‌యంలో అక్టోబ‌ర్‌16 విశ్వవ్యాప్తంగా థియేట‌ర్ల‌కు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్, స్టైలిష్ ఫైట్స్, దిమ్మ‌తిరిగే యాక్ష‌న్ సీన్ల‌తో ద‌డ‌ద‌డ‌లాడించేశారు. సిట్యుయేష‌న‌ల్ కామెడీ కూడా అదిరిపోయింది. మొత్తంగా చూస్తే యాక్ష‌న్ సినిమాలు బాగా ఇష్ట‌ప‌డే వారికి ఫుల్ మీల్స్ ప‌క్కా అనేలా ట్రైల‌ర్ ఉంది. మీరూ ఇంకా చూడ‌కుంటే ఇప్పుడే ట్రైల‌ర్ చూసేయండి. ఇది తెలుగులో కూడా ఉంది.

ఈ చిత్రంలో.. నోహ్ సెంటినియో (Noah Centineo), ఆండ్రూ కోజీ (Andrew Koji), కాలినా లియాంగ్ (Callina Liang), జో రోమన్ రెయిన్స్ అనోయి ((Joe "Roman Reigns" Anoa'i ), డేవిడ్ దస్తమల్చియాన్ వంటి వారు లీడ్ రోల్స్‌లో న‌టించ‌గా, కితావో సకురాయ్ (Kitao Sakurai) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పారామౌంట్ పిక్చ‌ర్స్ (Paramount Pictures) విడుద‌ల చేస్తోంది.

Updated Date - Apr 17 , 2026 | 01:18 PM