సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ABN, Publish Date - May 23 , 2026 | 02:57 PM

హాలీవుడ్‌ సీక్వెల్స్‌కు పెట్టింది పేరు. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌లోనూ సీక్వెల్స్ విరివిగా మొదలయ్యాయి. ‘కెజియఫ్’, ‘దేవర’, ‘సలార్’.. ఇలా సీక్వెల్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంది.

Conan The Barbarian Sequel Update

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali) చిత్రంతో ప్రేక్షకులకు సీక్వెల్స్‌పై మరింతగా ఇంట్రస్ట్ పెరిగిందనేది కాదనలేని వాస్తవం. వాస్తవానికి హాలీవుడ్‌ ఇలాంటి సీక్వెల్స్‌కు పెట్టింది పేరు. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌లోనూ సీక్వెల్స్ విరివిగా మొదలయ్యాయి. ‘కెజియఫ్’, ‘దేవర’, ‘సలార్’.. ఇలా సీక్వెల్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంది. అయితే, ఒక పార్ట్ అయిన వెంటనే, కొద్ది వ్యవధిలో మరో పార్ట్ తెరకెక్కించడం మాములే. కానీ, ఈ సినిమా వచ్చిన దాదాపు 40 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుందంటే.. ఆ మూవీ ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏది? ఇప్పుడు సీక్వెల్ చేయడానికి కారణం ఏంటి? అనే విషయాల్లోకి వెళితే..


ఆ సినిమా ఏదో కాదు.. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల చరిత్రలో సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసి, ఎన్నో చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘కోనన్ ది బార్బేరియన్’ (Conan the Barbarian) చిత్రం. ఈ సినిమా విడుదలై దాదాపు నాలుగు దశాబ్దాలు పూర్తయినప్పటికీ.. సినిమా క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. అప్పట్లో యాక్షన్ లెజెండ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ (Arnold Schwarzenegger)కు అంతర్జాతీయంగా భారీ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన చిత్రమిది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆర్నాల్డ్ తెలపడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాలీవుడ్ సినీ ప్రియుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగుతోంది.


ఈ సీక్వెల్‌కు ‘కింగ్ కోనన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో యువ యోధుడిగా కనిపించిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్.. ఇప్పుడీ సీక్వెల్‌లో వృద్ధ రాజుగా కనిపించబోతున్నారని, ఆయన వయసుకు తగిన విధంగా కథను, పాత్రను డిజైన్ చేసినట్లుగా సమాచారం. ఈ సీక్వెల్‌కు హాలీవుడ్ అగ్ర దర్శకుడు, ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీ చిత్రాల సృష్టికర్త.. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించనుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం కథని లాక్ చేశారని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అద్భుతమైన విజువల్ వండర్‌గా, యాక్షన్ ప్రేమికులను ఆకర్షించేలా.. అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఈ సీక్వెల్‌‌ను రెడీ చేయబోతున్నారని.. హాలీవుడ్ సర్కిల్స్‌లో అప్పుడే వార్తలు వైరల్ అవుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Updated Date - May 23 , 2026 | 02:57 PM