The Odyssey: ఇదెక్క‌డి క్రేజ్‌.. నోల‌న్ మామ‌! ది ఒడిస్సీ రిలీజ్‌కు ముందే సంచలనం.. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:26 PM

వరల్డ్‌ వైడ్‌గా టాప్‌ డైరెక్టర్స్ లిస్ట్‌ లో క్రిస్టఫర్‌ నోలన్ (Christopher Nolan), జేమ్స్‌ కామెరూన్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి.

The Odyssey

ప్రస్తుతం వరల్డ్‌ వైడ్‌గా టాప్‌ డైరెక్టర్స్ లిస్ట్‌ లో క్రిస్టఫర్‌ నోలన్ (Christopher Nolan), జేమ్స్‌ కామెరూన్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. సినిమాను ఒక విజువల్ వండర్‌గా మార్చడంలో వీరిద్దరి శైలి వేరు. టెర్మినేటర్‌, టైటానిక్‌, అవతార్‌ సిరీస్‌లతో జేమ్స్‌ కామెరూన్‌ సరికొత్త ప్రపంచాలను సృష్టిస్తే, క్రిస్టఫర్‌ నోలన్‌ మైండ్ బెండింగ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హాలీవుడ్‌లో బ్యాట్‌మేన్‌ సిరీస్‌కు ఊహించని క్రేజ్‌ తీసుకొచ్చిన ఘనత కూడా క్రిస్టఫర్‌ నోలన్‌కే దక్కుతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన ఓపెన్‌ హైమర్‌కు కొంచెం మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా, మిగిలిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్స్‌ను నమోదు చేసినవే. ఆ రేంజ్ హిస్టరీ ఉంది కాబట్టే, ఇప్పుడు నోలన్ నుంచి వస్తున్న సరికొత్త వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం ది ఒడిస్సీ (The Odyssey) సినిమాతో జులై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని వివాదాలు, రూమర్స్ తెరపైకి వచ్చాయి. ది ఒడిస్సీ చిత్రంకు సంబంధించిన అసలు స్టోరీని వక్రీకరించి తీసారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనివల్ల కొంత నెగిటివ్‌ టాక్‌ కూడా స్ప్రెడ్‌ అయింది. కానీ, నోలన్ సినిమా అంటే ఊరికే ఉంటుందా? రీసెంట్‌గా జరిగిన ప్రీమియర్స్‌ తో ఆ నెగిటివ్ రూమర్స్‌ అన్నింటికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నోలన్ విజువల్ పజిల్స్‌కు మైండ్ బ్లాక్ అయిందంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్‌తో భారీ పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ది ఒడిస్సీ, ఇక రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇక ఇండియా విషయానికి వస్తే, ఇక్కడ కూడా నోలన్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. మన దేశంలో ఈ హాలీవుడ్ దర్శకుడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా ముంబైలో జరిగిన ది ఒడిస్సీ ప్రీమియర్‌లో ఇండియాతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు నోలన్‌. ముంబైలోని ఒక లోకల్ ఇండియన్‌ రెస్టారెంట్‌లో తన టీమ్‌తో కలిసి ఆయన లంచ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. అంతేకాదు, తన సినిమాలకు ఇండియా అనేది ఒక బిగ్గెస్ట్‌ మార్కెట్‌ అని నోలన్ స్వయంగా చెప్పిన మాటలు ఇండియన్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.

నోలన్ అన్న మాటలు అక్షరాలా నిజమని ఇప్పుడు బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఇండియాలో ఉన్న అన్ని ఐమ్యాక్స్‌ స్క్రీన్స్‌ ది ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో హౌజ్‌ఫుల్‌ అయిపోయాయి. టికెట్లు దొరకడమే గగనంగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఇండియాలో కేవలం ప్రీ బుకింగ్స్‌తోనే దాదాపు 18 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వచ్చాయని టాక్‌ వినిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఈ నెంబర్స్ ఏ రేంజ్‌కు వెళ్తాయో ఊహించడం కూడా కష్టమే. మరి రేపటి నుంచి థియేటర్లలో ది ఒడిస్సీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - Jul 16 , 2026 | 04:45 PM