సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bruce Leung: 'కుంగ్ ఫూ హస్టిల్'.. క‌ప్ప విల‌న్ క‌న్నుమూత

ABN, Publish Date - Jan 18 , 2026 | 09:05 PM

ప్ర‌ముఖ చైనా న‌టుడు.. బ్రూస్ లియుంగ్ సియు- లంగ్ (Bruce Leung ) క‌న్నుమూశారు.

Bruce Leung

ప్ర‌ముఖ చైనా న‌టుడు.. బ్రూస్ లియుంగ్ సియు- లంగ్ (Bruce Leung ) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ జ‌న‌వ‌రి 14, బుధ‌వారం రోజున‌ తుదిశ్వాస విడిచాడు. కాగా ఈ వార్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 1971లో సినిమా కెరీర్ ప్రారంభించిన లంగ్ చివ‌ర‌గా 2020లో ఓ చైనీస్ సిరీస్‌లో న‌టించాడు. ఆయ‌న అస‌లు పేరు లియుంగ్ చోయ్-సాంగ్ (Leung Choi-sang).

1948లో జ‌న్మించిన లంగ్‌ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో నిష్ణాతుణిగా పేరు గ‌డించాడు. ఆపై సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 100కు పైగా హంకాంగ్‌ చిత్రాల్లో న‌టించాడు. 2004లో వ‌చ్చిన కుంగ్ ఫూ హస్టిల్ (Kung Fu Hustle) అనే సినిమాతో విల‌న్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు,. ఆ సినిమా తెలుగులోనూ డ‌బ్ అయి మంచి విజ‌యం సాధించింది. అయితే.. ఆ మూవీలో క‌ప్ప స్టైల్‌లో చేసిన ఫైట్ సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలిచింది. ఇప్ప‌టికీ ఆ ఫైట్ గురించి అనేక మంది ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Updated Date - Jan 18 , 2026 | 09:30 PM