పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశా.. బ్రాడ్ పిట్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 31 , 2026 | 09:33 PM
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇది కేవలం టాలీవుడ్, బాలీవుడ్ కి మాత్రమే కాదు.. హాలీవుడ్ లో కూడా వర్తిస్తుంది.
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇది కేవలం టాలీవుడ్, బాలీవుడ్ కి మాత్రమే కాదు.. హాలీవుడ్ లో కూడా వర్తిస్తుంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట.. కొన్నాళ్ళకే విడిపోయారు. ఇక ప్రస్తుతం ఆ హీరో.. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఆ జంట ఎవరు అంటే హాలీవుడ్‌లో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన డ్రీమ్ జోడీ బ్రాంజెలీనా.. బ్రాడ్ పిట్ - ఏంజెలీనా జోలీ. వీరి ప్రేమ కథ గురించి, పెళ్లి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ ఐకానిక్ లవ్ స్టోరీ ముగింపు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
తాజాగా బ్రాడ్ పిట్ పెళ్లి అతని జీవితాన్ని ఎంత నాశనం చేసిందో వివరిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద పొరపాటని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విడాకుల వివాదం తన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ఆర్థికంగా కూడా కోలుకోలేని దెబ్బ తీసిందని బ్రాడ్ పిట్ ఆరోపించాడు. ఈ సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల తన సంపాదించిన ఆస్తిలో సగం తుడిచిపెట్టుకుపోయిందని, అంతేకాకుండా, తన పిల్లలను తనపైకి రెచ్చగొట్టి, మానసికంగా దూరం చేశారని.. చివరకు పిల్లలు తమ పేరు చివర ఉన్న తన ఇంటిపేరు పిట్ ను కూడా తొలగించుకునేలా చేశారని తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోవాల్సింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
బ్రాడ్ పిట్- ఏంజెలీనా జోలీకి ఆరుగురు పిల్లలు. ముగ్గురు పిల్లలను వారు దత్తత తీసుకున్నారు. వీరందరూ కూడా బ్రాడ్ ఇంటి పేరు పిట్ ను తమ పేర్ల నుంచి లీగల్ గా తొలగించుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్ పిట్ ఒక్కడే ఉంటున్నాడు. వెండితెరపై ప్రేమ కథలకు హ్యాపీ ఎండింగ్స్ రాసే హాలీవుడ్‌లోనే... నిజ జీవితంలో విడాకుల స్క్రిప్ట్ మొదలయ్యాక అసలైన డ్రామా ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఒకప్పుడు ఎంతో ముచ్చటగా కనిపించిన ఈ జంట మధ్య ఇంతటి విద్వేషం బయటపడటం పట్ల హాలీవుడ్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.