టామ్ క్రూజ్‌కు ఘోర అవమానం.. హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఫ్లాప్
ABN, Publish Date - Oct 09 , 2026 | 07:11 AM
ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమ్, నేమ్ ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రమే వర్క్ అవుతుందని ఇటీవల విడుదలైన భారీ చిత్రం మరోమారు రుజువు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమ్, నేమ్ ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రమే వర్క్ అవుతుందని ఇటీవల విడుదలైన భారీ చిత్రం మరోమారు రుజువు చేసింది. వయసుతో సంబంధం లేకుండా నవ యువకుడిగా సినిమాలు అందులోనూ ఎలాంటి డూప్ లేకుండా ప్రాణాంతక స్టంట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise).
దీంతో క్రూజ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గతేడాది మిషన్ ఇంఫాజిబుల్ డెడ్ ది ఫైనల్ రికనింగ్ (Mission: Impossible – The Final Reckoning) సినిమాతో అలరించిన ఆయన తాజాగా ఆస్కార్ విన్నర్ డైరెక్టర్ అలెజాండ్రో కాంబోలో డిగ్గర్ అనే డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ డిగ్గర్ (Digger) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది.
దాదాపు $180 మిలియన్ల భారీ బడ్జెట్ (రూ.1746 కోట్లు), ప్రమోషన్ ఖర్చులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం $25 మిలియన్లు (రూ.243 కోట్లు) మాత్రమే రాబట్టి తీవ్ర నిరాశ పరిచింది. బలహీనమైన కథ, నెమ్మదైన కథనం కారణంగా డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా వల్ల నిర్మాతలకు సుమారు $155 మిలియన్లకు పైగా (రూ. 1500 కోట్లకు పైగా) నష్టం వాటిల్లనుందని సమాచారం. టామ్ క్రూజ్ కెరీర్‌లోనే కాకుండా, హాలీవుడ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచింది.