Avengers Doomsday: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’.. కొత్త టీజర్
ABN, Publish Date - Oct 25 , 2026 | 05:05 PM
రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా నటిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కొత్త టీజర్ విడుదలైంది.
మార్వెల్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్! ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ‘అవెంజర్స్’ ఫ్రాంచైజీ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers: Doomsday). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ హాలీవుడ్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
ఐరన్ మ్యాన్‌గా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్.. ఇప్పుడు డాక్టర్ డూమ్‌గా కనిపించనుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో హీరోగా అలరించిన ఆయన, ఈసారి ప్రతినాయకుడి పాత్రలో ఎలాంటి ప్రభావం చూపిస్తారన్న ఆసక్తి నెలకొంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో డాక్టర్ డూమ్ పాత్ర ఎలాంటి మలుపులకు కారణమవుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. కొత్త టీజర్‌తో ఆసక్తిని పెంచిన ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.