సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Desert Warrior: 1400 కోట్ల బడ్జెట్‌..6 కోట్ల కలెక్షన్స్‌! వ‌ర‌ల్డ్‌లోనే.. బిగ్గెస్ట్‌ డిజాస్టర్ మూవీ

ABN, Publish Date - May 08 , 2026 | 10:35 AM

సినిమా అంటేనే ఒక గ్యాంబ్లింగ్. కొన్నిసార్లు చిన్న సినిమాలు కోట్లు కొల్లగొడితే, మరికొన్నిసార్లు భారీ బడ్జెట్ సినిమాలు కనీసం పోస్టర్ ఖర్చులను కూడా రాబట్టలేవు.

Desert Warrior

సినిమా అంటేనే ఒక గ్యాంబ్లింగ్. కొన్నిసార్లు చిన్న సినిమాలు కోట్లు కొల్లగొడితే, మరికొన్నిసార్లు భారీ బడ్జెట్ సినిమాలు కనీసం పోస్టర్ ఖర్చులను కూడా రాబట్టలేవు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా, వారి ఇమేజ్ వల్ల మినిమం వసూళ్లు వస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కథ వేరు. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్.. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్.. పేరున్న నటీనటులు.. అయినా సరే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అదే.. డిజర్ట్ వారియర్ (Desert Warrior).

రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Rise of the Planet of the Apes) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రూపర్స్‌ వ్యాట్ (Rupert Wyatt) దర్శకత్వంలో, సౌదీ మీడియా దిగ్గజం ఎంబీసీ (MBC Studios) గ్రూప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ డిజర్ట్ వారియర్ చిత్రాన్ని నిర్మించింది. ఆంథోనీ మాకీ (Anthony Mackie), ఐషా హార్ట్ (Aiysha Hart), బెన్ కింగ్‌స్లే (Ben Kingsley) లాంటి ఉద్దండులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఏడవ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. సినిమా మేకింగ్ దశ నుంచే అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడం, దానివల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్ ఏకంగా 1400 కోట్లకు చేరుకోవడం మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఏ సినిమాకైనా ప్రమోషన్స్ ప్రాణం. కానీ, ఈ చిత్ర ప్రధాన హీరో ఆంథోనీ మాకీ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం సినిమాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. విశేషమేమిటంటే, ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చేసరికి అసలు ఇలాంటి ఒక సినిమా ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది.

ఇక బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే, ఇది ఒక పీడకల అనే చెప్పాలి. 1400 కోట్లు ఖర్చు పెడితే, ఈ సినిమా సాధించిన వసూళ్లు కేవలం 6 కోట్లు మాత్రమే..! అంటే పెట్టిన పెట్టుబడిలో 99 శాతానికి పైగా నష్టం వచ్చింది. సినిమా చరిత్రలో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏ పెద్ద సినిమాకు కూడా ఎదురుకాలేదు. ఫలితంగా డిజర్ట్ వారియర్ చిత్రం బాక్సాఫీస్ ప్లాపుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా నెత్తిన పెట్టుకునే ఆడియన్స్, ప్రమోషన్స్ లేకపోయినా.. క్వాలిటీ లోపించినా ఎంత పెద్ద సినిమానైనా తిరస్కరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. హాలీవుడ్ చరిత్రలో ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

Updated Date - May 08 , 2026 | 10:36 AM