సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Psych Siddhartha Movie Review: 'సైక్ సిద్ధార్థ' మూవీ రివ్యూ

ABN, Publish Date - Jan 01 , 2026 | 07:22 PM

శ్రీనందు హీరోగా నటించి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సినిమా 'సైక్ సిద్ధార్థ'. సురేశ్ బాబు ప్రెజెంటర్ గా ఉన్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Psych Siddhartha Movie

ఇటీవలి కాలంలో నటుడు నందు అంత అదృష్టవంతుడు మరొకరు లేరేమో! అతను నటించిన మూడు సినిమాలు విత్ ఇన్ వీక్ లో జనం ముందుకు వచ్చాయి. డిసెంబర్ 25న నందు (Nandu) కీ-రోల్ ప్లే చేసిన 'దండోరా' (Dhandoraa) విడుదల కాగా, జనవరి 1న హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' (Psych Siddhartha), విలన్ గా నటించిన 'వనవీర' (Vanaveera) విడుదలయ్యాయి. విశేషం ఏమంటే 'సైక్ సిద్ధార్థ'కు నందు నిర్మాణ భాగస్వామి కూడా!

ఇతరులకు కాస్తంత భిన్నంగా ఉండే సిద్ధార్థ (శ్రీనందు) కు త్రిష (ప్రియాంక రెబకా శ్రీనివాస్) పబ్ లో పరిచయం అవుతుంది. ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ మెయిన్ టైన్ చేయడం మొదలెడతాడు. సిద్ధార్థ బిజినెస్ పార్టనర్ అయిన మన్సూర్, త్రిష మధ్య కూడా రిలేషన్ షిప్ డెవలప్ అవుతుంది. డబ్బు పిచ్చి ఉన్న త్రిష... ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమౌతుంటుంది. అదే సమయంలో త్రిష, మన్సూర్ కలిసి సిద్ధార్థ ను కంపెనీ నుండి బయటకు పంపేస్తారు. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో సిద్ధార్థ ఓ బస్తీలోకి మారతాడు. భర్తతో వేగ లేక కొడుకుతో కలిసి ఇంటి నుండి బయటకు వచ్చేసిన శ్రావ్య (యామిని భాస్కర్) కూడా అదే బస్తీలో సిద్ధార్థ ఇంటి కిందే ఉంటుంది. దాంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో సరికొత్త జీవితాన్ని సాగించడానికి సిద్ధార్థ ప్రయత్నిస్తాడు. అయితే... తన పాత పగను తీర్చుకోవడానికి సిద్ధార్థ్‌ ఏం చేశాడు? త్రిష, మన్సూర్ లకు అతను బుద్ధి చెప్పగలిగాడా? త్రిషలో ప్రాయశ్చితం ఏమైనా వచ్చిందా? ఈ ప్రయాణంలో సిద్ధార్థ జీవితంలో జరిగిన పరిణామాలేమిటీ? అనేదే ఈ సినిమా.


నిజానికి కొన్ని సినిమాలు కథ కంటే కథనం కారణంగా ప్రేక్షకాదరణ పొందుతాయి. దాంతో మేకర్స్ స్టోరీ కంటే స్క్రీన్ ప్లే కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది కూడా ఓ రకంగా అలాంటి సినిమానే. అయితే కథ మరీ సింపుల్ గా ఉండటం... స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడంతో చూసిన సన్నివేశాలనే మళ్ళీ మళ్ళీ చూసిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. పైగా అడల్ట్ కంటెంట్, అవసరం లేని అశ్లీల సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. దాంతో ఫ్యామిలీతో ఈ సినిమాకు వెళ్ళలేని పరిస్థితి. సరదాగా స్నేహితులతో థియేటర్ కు వచ్చే యూత్ కోసం తీసిన సినిమా. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే జన్ జీ ఎక్కువగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఇలాంటి సినిమాను సురేశ్‌ బాబు (Suresh Babu) ఎందుకు పంపిణీ చేసి ఉంటారో అర్థం కాదు. యూత్ ను తప్పకుండా ఈ మూవీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఏ మూలనో ఆయనకు ఉండి ఉంటుంది. కానీ నిజానికి 'సైక్ సిద్ధార్థ'కు అంత సీన్ లేదు.


నటీనటుల విషయానికి వస్తే... సిద్ధార్థ పాత్ర కోసం నందు ప్రాణం పెట్టేశాడు. ఆ పాత్రలోని స్ట్రగుల్ ను, సైకో యాక్టింగ్ ను బాగా చేశాడు. 'దండోరా, వనవీర' సినిమాల్లోని పాత్రలకు దీనికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అలానే యామిని భాస్కర్ (Yamini Bhaskar) తన పాత్రకు తగిన న్యాయం చేకూర్చింది. ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు! మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించడంతో పాటు కాస్తంత భిన్నంగా నటించే ప్రయత్నం చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి (Varun Reddy) తాను తీయాలనుకున్న విధంగా సినిమాను తీసేశాడు... అంతే! స్మరణ్‌ సాయి (Smaran Sai) నేపథ్య సంగీతం డిఫరెంట్ గా ఉండి, ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నా... మేకర్స్ కథ మీద ఇంకాస్తంత గట్టిగా హోమ్ వర్క్ చేసి, కొన్ని సీన్స్ ను సెన్సిబుల్ గా తీసి ఉంటే 'సైక్ సిద్ధార్ధ' మరింత బెటర్ మూవీ అయి ఉండేది.

రేటింగ్: 2.25/5

ట్యాగ్ లైన్: జన్ జీ కోసం...

Updated Date - Jan 01 , 2026 | 07:22 PM