సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Biker Review: శర్వానంద్‌ స్పోర్ట్స్‌ డ్రామా.. 'బైకర్‌’ మూవీ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Apr 03 , 2026 | 09:31 AM

సంక్రాంతి బరిలో 'నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అలరించారు శర్వానంద్‌ (Sharwanand). తాజాగా 'బైకర్‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది దేశంలోనే మొదటి మోటోక్రాస్‌ సినిమాగా తెరకెక్కించింది.

Biker

సినిమా రివ్యూ: బైకర్‌ (Biker Review)
విడుదల తేది: 3–4–2026

'నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగి ఆడియన్స్ ను అలరించాడు శర్వానంద్. ఇప్పుడు 'బైకర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దేశంలోనే మొదటి మోటో క్రాస్ సినిమాగా తెరకెక్కింది ‘బైకర్’. మాళవిక నాయర్ కథానాయికగా బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, శశాంక్ కీలక పాత్రధారులుగా... 'మా నాన్న సూపర్హీరో’ దర్శకుడు అభిలాష్రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. యు.వి.క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ... శర్వానంద్ న్యూ లుక్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చేసిన ప్రయత్నం, రాజశేఖర్ శర్వాకు తండ్రిగా నటించడం వంటి అంశాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను తీసుకొచ్చాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…

కథ:

సునీల్ నారాయణ్ (రాజశేఖర్) పేరున్న మోటో క్రాస్ రేసర్. ఈ క్రీడకు క్రికెట్ తరహాలో గుర్తింపు తీసుకురావాలనేది ఆయన కోరిక. అనుకోని సంఘటనల వల్ల సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్ అవుతాడు. దాంతో మరింత మంది రేసర్లను తయారు చేసే పనిలో ఉంటాడు. చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టపడే సునీల్ కుమారుడు విక్కీ నారాయణ్ (శర్వానంద్) తండ్రి దగ్గరే రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతను ట్రాక్ ఎక్కాడంటే గెలిచి తీరాల్సిందే. అయితే కోచ్గా ఉన్న తండ్రి మాత్రం విక్కీ గెలుపును అంత సులువుగా అంగీకరించడు. 'నువ్వు గెలవలేదు… మిగిలిన వాళ్లు ఓడిపోయారంతే’ అంటూ కొడుకు సక్సెస్ను ఎంజాయ్ చేయనివ్వడు. రేస్ విషయంలో ఎంతో కఠినంగా ఉంటాడు. దాంతో తండ్రి కల నెరవేర్చడానికి విక్కీ ఇంటర్నేషనల్ రేసింగ్లో పాల్గొంటాడు. అయితే మూడో స్థానంలోనే ఆగిపోతాడు. ఆ తర్వాత రేసింగ్కు దూరమై భార్య అనన్య (మాళవిక నాయర్), బిడ్డతో సరదాగా గడుపుతుంటాడు. దాంతో తండ్రీ కొడుకుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. విక్కీ రేసింగ్ ఆపడానికి కారణమేంటి? ఆ తర్వాత విక్కీ మళ్లీ ట్రాక్ ఎందుకు ఎక్కుతాడు? ఇంటర్నేషనల్ లెవల్ రేసింగ్లో పాల్గొని గెలిచాడా? తండ్రి కల నెరవేర్చాడా? లేదా? అన్నదే ‘బైకర్’ కథ.


విశ్లేషణ:

మోటోక్రాస్ రేసింగ్, తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు నేపథ్యంలో సాగే కథ ఇది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథలకు ఆ ఆటలో సోల్ ఎంత ముఖ్యమో… భావోద్వేగాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉండాలి. కథ ముందుకు నడవాలన్నా.. వెనక్కి వెళ్ళాలన్నా భావోద్వేగాలే కీలకం. దర్శకుడు ఈ రెండింటిని మిళితం చేసి కథ రూపొందించాడు. అయితే కీలకమైన భావోద్వేగాలను పండిచటంలో మాత్రం సక్సెస్ కాలేక పోయాడు. 2003లో కథ మొదలవుతుంది. హీరో ఇంట్రడక్షన్, అతని ప్లాష్బ్యాక్, తండ్రితో బంధం, ప్రేయసితో లవ్ సీన్స్, అన్వర్తో రేసింగ్ కాంపిటీషన్ ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇదంతా కొత్తగా ఏమీ ఉండదు. తండ్రిపై నిందలు పడటం… అది కొడుకు తట్టుకోలేకోవడంతో సెకెండాఫ్ మొదలవుతుంది. హీరో రేసింగ్కు దూరమయ్యే రీజన్ బలంగా లేకున్నా… తిరిగి వచ్చి జర్మనీ రేసర్తో తలపడే సన్నివేశాలు మాత్రం థ్రిల్ కలిగిస్తాయి. తండ్రీకొడుకుల మధ్య సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్లాష్బ్యాక్ పక్కనపెడితే ట్రాక్లో రేసింగ్ సీన్స్ మాత్రం ఆడియన్స్ కు గూజ్ బంప్స్ కలిగిస్తాయి. రేసింగ్ నేపథ్యమున్న చిత్రాలు తెలుగు తెరపై అంతగా రాకపోవడం వల్లో ఏమో కాస్త కొత్త అనుభూతి కలుగుతుంది. దర్శకుడు రాసుకున్న కథ బావుంది. తెరకెక్కించే విషయంలోనే కొద్దిగా కన్ఫూజ్ అయ్యాడు. రేసింగ్ సీన్స్ మాత్రం మెప్పిస్తాయి. సెకెండాఫ్లో కొన్ని చోట్ల మాటలు ఆకట్టుకునేలా సాగాయి. భావోద్వేగాలు పక్కన పెడితే చివరి 20 నిమిషాల సినిమాను బాగా ప్లాన్ చేసి తీశాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి.

నటీనటుల పనితీరు..

హీరోగా శర్వానంద్ రేసర్గా నటించడానికి శారీరకంగా, మానసికంగా పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరు పెట్టలేం. చాలా నేచురల్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లోనూ మెప్పించాడు. శర్వాకు భార్యగా అనన్య పాత్రలో మాళవిక నాయర్ కూడా చక్కగా నటించింది. ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. రేసింగ్ కోచ్గా సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ జీవించారు. సినిమాకు ఆయన పాత్ర కీలకం. ఆయన అనుభవం ఈ పాత్రను పండించడంలో ఎంతగానో ఉపయోగపడింది. హీరోయిన్ తల్లిగా తులసి మెరిశారు. అతుల్ కులకర్ణి పాత్ర హూందాగా ఉంది. బ్రహ్మాజీ, నవీన్ నేని మరో రేసర్ అన్వర్ పాత్రధారి ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారు. సాంకేతిక పరంగా చూస్తే జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. జిబ్రాన్ పాటల్లో మెరుపులు లేవుగానీ, నేపథ్య సంగీతం బాగుంది. ప్రత్యేకించి రేసింగ్ సీన్స్లో చాలా బావుంది. యు.వి సంస్థ రేసింగ్ కథకు తగ్గట్లు బాగా ఖర్చు పెట్టారు. అది తెరపై కనిపించింది కూడా. అంచనాలు లేకుండా వెళ్లి థియేటర్లో కూర్చుంటే ఈ రేసింగ్ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. ‘F1’ లాంటి సినిమాలు చూసి అంచనాలతో వెళితే మాత్రం నిరాశపడటం ఖాయం.

ట్యాగ్లైన్: ఎమోషన్ లెస్ ‘బైకర్’

రేటింగ్: 2.5 / 5

Updated Date - Apr 03 , 2026 | 12:02 PM