సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Husharu Pittalu Review: హుషారు పిట్టలు ఎలా ఉందంటే..

ABN, Publish Date - Aug 15 , 2026 | 07:56 AM

అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్‌, వాసవి గణేషన్‌ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌తో విపరీతంగా బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review)
అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్తో బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ: (Husharu Pittalu Review)


మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పు దారి లోకి తీసుకు వెళతాడు. బాలన్న మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి ఆపై చిట్టి తల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమితో ఇద్దరూ దారి తప్పి, హద్దులు దాటే దాకా వెళతారు. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి) హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. అప్పుడు వారిద్దరి కుటుంబాలు ఎలా స్పందించాయి? చిన్న వయసులో తెలిసీ తెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ. 


విశ్లేషణ
విశ్లేషణ
స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు, స్కూల్ లోనే ఉన్న యువతీ శరీరాకర్షణకు లోనై చేసిన పని వారి భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపించిందన్నది ఈ సినిమా ఇతివృత్తం. దీనికి బోల్డ్ కంటెంట్ తో పాటు ఫాదర్ సెంటిమెంట్, చివర్లో ఓ సందేశాన్ని జోడించి దర్శకుడు తెరకెక్కించాడు. గతంలో ఇదే తరహాలో 'చిత్రం, ఈ రోజుల్లో' వంటి చిత్రాలు కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమా వాటికంటే బోల్డ్ గా ఉంది. ఫస్టాఫ్ అంతా రవి, చిట్టి మధ్య ప్రేమ, రెచ్చగొట్టే మాటలు, శారీరక ఆకర్షణ… ఆ తర్వాత శృంగార కలాపాలతో నిండిపోయింది.  బోల్డ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులకు కొదవ లేదు. ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే ట్విస్ట్ తో కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది. అక్కడి నుంచి కథ ఫ్యామిలీ, ఫాదర్ సెంటిమెంట్ వైపు టర్న్ అవుతుంది. ఇద్దరూ చేసిన తప్పు వల్ల ఇరు కుటుంబాల మధ్య సంఘర్షణ, ఎంత ఆవేదనకు గురయ్యాయనే  అంశాలను కొంత భావోద్వేగంతో మలిచారు. ఫాదర్ సెంటిమెంట్ సీన్స్  కొన్ని చోట్ల తేలిపోయాయి. పిల్లల ఫోన్ల వాడకం,  యుక్తవయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తెరపై వల్గారిటీ, ఎక్స్పోజింగ్ లాంటివి చూపించకున్నా.. వాటిని ఫీలయ్యేలా చేశారు. ఇక హీరోయిన్ పాత్ర కండోమ్స్, వయాగ్రాను స్వయంగా హీరోకి ఇచ్చి.. ఇంకా కోరికలు పెరగాలని చెప్పే సన్నివేశాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా లేవు. మైనర్ బాలికతో శృంగారం చేస్తే ఫోక్సో యాక్ట్ తప్పదని ఆ తరహా సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ డిస్క్లైమర్ వేశారు తప్ప వాటిని చూపించకూడదానే ఇంగిత జ్ఞానం మాత్రం లేకపోయింది. బోల్డ్ కంటెంట్ ను డీల్ చేసినంతగా సందేశాత్మక సన్నివేశాలను దర్శకుడు సరైన పద్ధతిలో డీల్ చేయలేకపోయాడు. ఆయా సీన్స్ లో ఇంకా భావోద్వేగాలను బలంగా చూపించి సందేశం ఇచ్చే అవకాశం ఉన్నా దర్శకుడు చేయలేకపోయాడు. ప్రీ–క్లైమాక్స్ కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. అయితే క్లైమాక్స్ మొత్తం ఊహకు అందేలాగే ఉండి తేలిపోయింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
హీరో అన్ష్, హీరోయిన్ వాసవి గణేషన్ ఇద్దరికీ ఇది తొలి సినిమా. అయినా నటన పరంగా పాత్రల్లో ఇమిడిపోయారు. టీనేజర్స్లో ఉండే అమాయకత్వం, ఆకర్షణ, భయాలను నేచులర్గా తెరపై ఆవిష్కరించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో గోవర్ధన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రణీ రెడ్డి స్క్రీన్  ప్రెజెన్స్ బావుంది. కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ను డామినేట్ చేసింది. ఇతర పాత్రధారులు అంతా ఓకె. బోల్డ్ కంటెంట్ కు తగ్గట్టే లిరిక్స్ కూడా ఉండటం విశేషం. ఎమోషనల్ సీన్స్ ను  నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది. పల్లె వాతావరణానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు ఓకె. ఈ తరహా కథలు ఎన్ని వచ్చినా.. ఫస్టాఫ్ లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ యువతను ఆకట్టుకుంటాయి.


ట్యాగ్‌లైన్‌: యూత్‌ని టార్గెట్‌ చేసే పిట్టలు..

రేటింగ్‌: 2.5/5

Updated Date - Aug 15 , 2026 | 09:53 AM