సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దూరదర్శని మూవీ రివ్యూ

ABN, Publish Date - May 15 , 2026 | 10:27 PM

సువిక్షిత్‌ బొజ్జ, గీతికా రతన్ జంటగా తెరకెక్కిన సినిమా 'దూరదర్శని'. 90ల నాటి కథతో కార్తికేయ బొమ్మి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.

Dooradarshini Movie

ఈ మధ్య కాలంలో ఎయిటీస్‌, నైంటీస్‌ కాలం నాటి కథలతో సినిమాలు తీయడం ఎక్కువైంది. పైగా టీవీ, వాటిలో వచ్చే సీరియల్స్ తో సినిమా చేయడం కూడా కామన్‌ అయ్యింది. అలా ఆ మధ్య 'శుభం' సినిమా వస్తే, ఇటీవల 'తిమ్మరాజుపల్లి టీవీ' వచ్చింది. తాజాగా అదే కోవలో 'దూరదర్శని' (Dooradarsini) సినిమా శుక్రవారం జనాలను పలకరించింది. సువిక్షిత్‌ బొజ్జ, గీతికా రతన్ జంటగా నటించిన ఈ సినిమాను కార్తికేయ బొమ్మి డైరెక్ట్ చేయగా, జయశంకర్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్ నిర్మించారు. మరి నైంటీస్‌ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ విలేజ్‌ లవ్‌ డ్రామా ఎలా ఉందో తెలుసుకుందాం.

మట్టపరు అనే గ్రామంలో జరిగే కథ ఇది. హరి (సువిక్షిత్‌ బొజ్జ), వాణి (గీతికా రతన్) ప్రేమించుకుంటారు. అయితే హరి వెనకబడి కులానికి చెందిన వాడు కాగా వాణి ఉన్నత కులానికి చెందిన పెద్దింటి అమ్మాయి. ఇద్దరి ఇళ్ళలో టీవీ లేకపోవడంతో దూరదర్శన్‌ లో చిత్రలహరి వచ్చే టైమ్‌ కు పేకరాజు (భాస్కర్‌ గొడుగునూరి) ఇంటికి చేరి అక్కడ టీవీ చూస్తూ ప్రేమలో ఓలలాడుతూ ఉంటారు. స్త్రీ లోలుడైన పేకరాజు కన్ను వాణి మీద పడుతుంది. అయితే హరి, వాణి ప్రేమలో ఉన్నారని తెలిసి, వారిని విడకొట్టడానికి వాణి అన్నయ్య పరశురామ్‌ (మేడపాటి విజయ్‌ కృష్ణారెడ్డి)ని పావుగా ఉపయోగించుకుంటాడు. అప్పటి వరకూ సామరస్యంగా ఉన్న ఊరిలో వీరిద్దరి ప్రేమ కారణంగా కులం చిచ్చు రేగుతుంది. సామాజిక కట్టుబాట్లను, ఆర్థిక తారతమ్యాలను దాటుకుని వీరిద్దరూ ఎలా ఒక్కటి అయ్యారు? పేకరాజుకు ఎలా బుద్ధి చెప్పారు? అనేది మిగతా కథ.


పేరుకు తగ్గట్టుగానే ఇది దూరదర్శన్‌ హవా సాగిన కాలం నాటి కథ. దాంతో సహజంగానే అప్పటి ప్రేమకథలు ఎలా ఉండేవో అలానే దీనిని తీశారు. ఆ కారణంగా సినిమా మొత్తం స్లో మోషన్ లో సాగిన అనుభూతి ప్రేక్షకుడు కలుగుతుంది. కులాల మధ్య అంతరాలు, ఊరిలో ఉండే రాజకీయాలు, యువ జంట అగచాట్లు వీటన్నింటినీ అప్పటి కాలానికి అనుగుణంగానే చూపించారు. కాకపోతే కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం ప్రధానమైన లోటు.

నటీనటుల విషయానికి వస్తే కొత్తవాడైన సువిక్షిత్‌ బొజ్జ మాగ్జిమమ్‌ తన వంతు ప్రయత్నం చేసి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అతనిలో నటుడిగా ఇంకా మెచ్యూరిటీ సాధించాల్సి ఉంది. గీతిక రతన్‌ హీరోయిన్‌గా బాగానే మెప్పించింది. హీరో తండ్రిగా కిట్టయ్య తనదైన పంథాలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన భాస్కర్‌ గొడుగునూరి తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. తేనెపూసిన కత్తి తరహా క్యారెక్టర్ ను ఆకళింపు చేసుకుని చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. ఇతర ప్రధాన పాత్రలను మేడపాటి విజయ్‌ కృష్ణారెడ్డి, బాలరాజు, భద్రం, జెమినీ సురేశ్‌, లావణ్య రెడ్డి తదితరులు పోషించారు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. గోదారి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ప్రకృతి అందాలను బాగానే తెరపై చూపించారు. అయితే కంటెంట్‌పై మేకర్స్ మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. ఏదేమైనా కొత్తవారితో తీసిన ఇలాంటి పాత కథా చిత్రాలు సినిమాలు ఆడియెన్స్ ను థియేటర్లకు తీసుకురావడం కష్టమే.

రేటింగ్‌: 2.25/5

ట్యాగ్‌లైన్‌: అలనాటి కథ!

Updated Date - May 15 , 2026 | 10:28 PM