ధురంధర్: ది రివేంజ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
ABN, Publish Date - Mar 18 , 2026 | 11:57 PM
గత డిసెంబర్‌లో థియేటర్లకు వచ్చిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ (Dhurandhar: The Revenge) ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గత డిసెంబర్‌లో థియేటర్లకు వచ్చిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ (Dhurandhar: The Revenge) ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హిందీ భాషలోనే విడుదలైన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే సింగిల్‌గా విడుదలై పుష్కర కాలంగా హిందీ సినిమా బాక్సాఫీస్‌కు పట్టిన బూజును దులిపేసింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సినిమా విడుదలై మూడు నెలలు గడిచినా ఇంకా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. ఇదిలాఉండగానే తాజాగా బుధవారం రాత్రి నుంచి ధురంధర్ పార్ట్ -2 ది రివేంజ్ సైతం ప్రీమియర్ షోలతో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు మునుపే అడ్వాన్స్ బుకింగ్‌లతోనే రూ. 150 కోట్లు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సరి కొత్త చరిత్ర సృష్టించింది.
ఇప్పటికే.. ఈ ధురంధర్ ది రివేంజ్ సినిమాను అనేక మంది చూసేయడమే గాక వారు తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సినిమా తమకు ఎలా అనిపించిందో చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి ప్రీమియర్ షోలకు వస్తున్న టాక్ ప్రకారం సినిమా 'సింగిల్ హ్యాండ్ గణేశ్' మాదిరి మరోమాట చెప్పాల్సిన అవసరం లేకుండా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. మొదటి పార్ట్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ రెండో భాగం ఉందని, మొదటి నుంచి చివరి వరకు ర్యాంప్ ఆడించారని, కిల్లింగ్, వయలెన్స్‌లో ప్రపంచానికి కొత్త అర్థం ఈ మూవీలో చూపించారని అంటున్నారు. అంతేకాకుండా నోట్ల రద్దు ఇన్సిడెంట్ ఎఫెక్ట్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారని, అలాగే దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సీన్లు కూడా అదిరి పోయాయని పోస్టులు, వీడియో క్లిప్పింగులు పెడుతున్నారు. రణ్ వీర్ సింగ్, మాధవన్, అర్జున్ రామ్‌పాల్, సంజయ్ దత్... వారి పాత్రల్లో జీవించారని కామెంట్లు పెడుతున్నారు.
మొదటి పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కాకుండా జస్కిరాత్ సింగ్... హమ్జా అలీ మజారీగా ఎందుకు మారాడనే ఫ్లాట్‌తో కథ స్టార్ట్ చేసి ఆపై రెహమాన్ బలూచ్ మరణాంతర పరిణామాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా, ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచారని చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ హాప్ అంతా డ్రామా, యాక్షన్ సీన్లతో నడిపించి సెకండాఫ్‌లో వయెలెన్స్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లారని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త బెంచ్‌మార్క్ సృష్టించారని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నిడివి సుమారు నాలుగు గంటలలు ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టలేదని చెబుతున్నారు. ఇలా సామాజిక మాద్యమాల్లో వస్తున్న అనేక రివ్యూలు వన్‌సైడ్‌గానే ఉన్నాయి. అంతా మూడుకు పైగానే రేటింగ్ ఇస్తున్నారు.