సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమా రివ్యూ: కార్మేని సెల్వం..

ABN, Publish Date - Apr 03 , 2026 | 08:29 PM

తమిళనాట విలక్షణ నటుల్లో సముద్రఖని ఒకరు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. తాజాగా ఆయన నటించిన తమిళ చిత్రం 'కార్మేని సెల్వం’. లక్ష్మీప్రియ, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, అభినయ,  కీలక పాత్రధారులు. రామ్‌చక్రి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ: కార్మేని సెల్వం.. (Carmeni Selvam)


తమిళనాట విలక్షణ నటుల్లో సముద్రఖని ఒకరు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. తాజాగా సముద్రఖని  నటించిన తమిళ చిత్రం 'కార్మేని సెల్వం’. లక్ష్మీప్రియ, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, అభినయ కీలక పాత్రధారులు. రామ్‌చక్రి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం  మేరకు  అక్కట్టుకుంది అన్నది రివ్యూలో  చూద్దాం.

కథ:
సెల్వం (సముద్రఖని) మధ్య తరగతి కుటుంబానికి చెందిన కారు డ్రైవర్‌. సెల్వం భార్య శాంతి (లక్ష్మి ప్రియ) ఇంటి సమీపంలో ఇడ్డీ కొట్టు నడుపుతూ భర్తకు ఆసరాగా ఉంటుంది.  సంపత్‌ (గౌతమ్‌ మీనన్‌) దగ్గర కొన్నేళ్లగా నమ్మకంగా పని చేస్తుంటాడు సెల్వం. బాగా డబ్బు సంపాదించి సొంత ఇల్లు కట్టుకోవాలని కూడబెట్టిన డబ్బులో కొంత పొదుపు చేస్తుంటారు. మేనకోడలి ఫంక్షన్‌లో సారె పెట్టే విషయంలో అవమానం జరుగుతుంది. శాంతి.. తన భర్తను తక్కువ చేసి మాట్లాడారని వెంటనే దాచుకున్న డబ్బును, మెడలో బంగారు నగలను తాకట్టు పెట్టి సారె పెడతారు. కొద్ది రోజులకి సెల్వం కొడుకు ప్రమాదానికి గురి కాగా ఆస్పత్రిలో బాగా ఖర్చు అవుతుంది. రూ.10 వేలు అప్పు చేయాల్సి వస్తుంది. దానిని తీర్చడం కోసం యజమాని సంపత్‌ లేని సమయంలో తన కారుని క్యాబ్‌గా తిప్పి డబ్బు సంపాదిస్తాడు. ఎవరో చెప్పిన మాటలు విని డబ్బు ఖర్చు చేస్తూ మరింత అప్పులు చేయసాగాడు. ఆ అప్పులు తీర్చడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఆ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాడు అన్నది కథ.


విశ్లేషణ:
ఈ రోజుల్లో మధ్య తరగతి కుటుంబాల్లో కొందరు ఉన్నంతలో సర్దుకుపోతుంటే.. మరి కొందరు అందని దానికి ఆశపడుతుంటారు. గొప్పలకు పోయి అధిక ఖర్చులతో అప్పుల పాలవుతున్నారు. ఈ సినిమా అలాంటి కథతోనే తెరకెక్కించారు దర్శకుడు రామ్‌ చక్రి. మధ్య తరగతి మనుషుల్లో డబ్బు ఎలాంటి ఆశ పెంచుతుంది. నిక్కచ్చిగా ఉండేవారిని మాయాలోకంలోకి తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందనే ది ఈ చిత్రంలో సెల్వం పాత్రతో చూపించారు. భార్య, భర్త, ఓ బిడ్డ ఇదీ సెల్వం కుటుంబం. వారి జీవితం సింపుల్‌గా ఎలా సాగేదో చెబుతూ కథ మొదలవుతుంది. దర్శకుడు పాత్రలను పరిచయం చేసిన తీరు బావుంటుంది. తన ఓనర్‌ సంపత్‌తో ఉండే అనుబంధం, తండ్రీ  కొడుకుల  మధ్య బంధం, భావోద్వేగాలు ఇవన్నీ సరదాగా సాగుతూ ఫస్టాఫ్‌ నడుస్తుంది. చెల్లి ఇంట్లో సెల్వమ్‌కు అవమానం జరగడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఈ జర్నీ మొత్తం నత్త నడకన సాగుతుంది. ఇక చేసిన అప్పులు తీర్చడం కోసం సెల్వం పడే కష్టం, ఎదురైన అవమానాలు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం ఇవన్నీ సెకెండాఫ్‌కు కీలకం. అయితే ఇందులో ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలు, ఇంటి స్థలం కొనే సన్నివేశాల మధ్య ఘర్షణను దర్శకుడు చాలా బ్యాలెన్స్‌డ్‌గా తెరకెక్కించారు. పతాక సన్నివేశాలు సెల్వం, తన కొడుకు, భార్య మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలను, డబ్బు సంపాదనకు షార్ఝా వెళ్లి కుటుంబాన్ని వదిలి అక్కడ ఉండలేక సెల్వం తనలో తాను పడే వేదన చూస్తే ఎలాంటి వ్యక్తి గుండె అయినా బరువెక్కాల్సిందే! ఎంతో కాలంగా తననే నమ్ముకున్న సెల్వంకు చివర్లో సంపత్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ హైలైట్‌. క్లైమాక్స్‌ మాత్రం అదిరిపోయేలా తీశారు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఎంతో హృద్యంగా మలిచారు. ుఅందని దానికి ఎగరకూడదు.. అవసరం లేనివి కొంటే.. అవసరమైనవి  కోల్పోతాం’ అనే సందేశంతో సినిమా ముగించారు. సినిమా స్లో అనే విషయం పక్కన పెడితే భావోద్వేగాలకు మాత్రం కనెక్ట్‌ అవుతారు.

నటీనటుల పనితీరు...

మధ్య తరగతి భర్తగా సెల్వం పాత్రకు సముద్రఖని వంద శాతం యాప్ట్‌ అయ్యారు. సహజత్వం, భావోద్వేగాలతో కట్టిపడేశారు. మధ్యతరగతి భార్యగా లక్ష్మీ ప్రియ కూడా అద్భుతమైన నటన కనబర్చారు. ఇద్దరి జోడీ కూడా చూడముచ్చటగా ఉంది. వీళ్ల కొడుకుగా కనిపించిన పిల్లాడు కూడా నటనతో ఆకట్టుకున్నాడు. కాసేపే కనిపించినా గౌతమ్‌ మీనన్‌, అభినయ చక్కని మార్క్‌ వేశారు. అయితే దర్శకుడు మాత్రం తాను రాసుకున్న కథను చక్కగా తెరకెక్కించాడు. ప్రేక్షకుల హృదయాలకు తాకేలా తీర్చిదిద్దాడు. ఇతర పాత్రధారులు ఫర్వాలేదు. దర్శకుడు తాను అనుకున్న కథ అనుకున్నట్లుగా చెప్పడంలో విజయం సాధించారు. కథనం నెమ్మదిగా సాగడం, ఊహకు అందేలా కొన్ని సన్నివేశాలు ఉండటం మైనస్‌గా చెప్పుకోవచ్చు. రామానుజన్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయింది. జె.యువరాజ్‌ కెమెరా వర్క్‌ కూడా బాగా కుదిరింది. ఎడిటింగ్‌ కాస్త డల్‌గా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఈ చిత్రం కనెక్ట్‌ అవుతుంది.

ట్యాగ్‌లైన్‌: మిడిల్ క్లాస్  సెల్వం..
రేటింగ్‌: 2.5/5

Updated Date - Apr 03 , 2026 | 09:32 PM