సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ ఏమైంది

ABN, Publish Date - Nov 27 , 2026 | 07:48 PM

వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా బృందం హీరో తిరువీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు.

విభిన్నమైన కథాంశాలతో రూపొందుతున్న సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, సంగీతం, సస్పెన్స్‌, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ కోవలోనే రూపొందుతున్న సైకలాజికల్ సస్పెన్స్ మ్యూజికల్ లవ్ థ్రిల్లర్ ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’. టింట్‌స్ప్రీ స్టూడియోస్ పతాకంపై అలేటి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర బృందం తాజాగా యువ కథానాయకుడు తిరువీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆయనతో పంచుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత అలేటి రాజేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రేమ, సంగీతం, సస్పెన్స్‌, మానసిక సంఘర్షణలతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

దర్శకుడు రామమూర్తి కొట్టాల మాట్లాడుతూ.. ప్రేమ, సంగీతం, మానసిక సంఘర్షణ, సస్పెన్స్‌ అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని వైవిధ్యంగా తెరకెక్కించామని తెలిపారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనం, ఊహించని మలుపులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 08:08 PM