సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సరైన జీవనశైలితోనే.. ఆరోగ్యం, అందం

ABN, Publish Date - Mar 14 , 2026 | 07:14 AM

లుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి రెజీనా కసాండ్రా.

Regina Cassandra

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి రెజీనా కసాండ్రా (Regina Cassandra). ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పుష్క‌రం పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ కేవ‌లం ద‌క్షిణాదికే ప‌రిమితం కాకుండా త‌రుచూ బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఫ‌లానా పాత్ర అనే బేధం లేకుండా కెరీర్ లో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.

2012లో శివ మ‌న‌సులో శృతి సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టి సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, రారా కృష్ణ‌య్య‌, ఎవ‌రు, రాకెట్రీ వంటి దాదాపు 30కి పైగా సినిమాలు చేసింది. కేవ‌లం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకోవడంలోప్రత్యేకంగా నిలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో కైవ‌ల్య అనే చిత్రంతో పాటు తమిళంలో మూకుట్టి అమ్మ‌న్ 2, ఫ్లాష్ బ్యాక్‌, కళ్ల‌ప్రాట్‌ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అలాగే మారే ఆఫ్ ఈస్ట్‌వ‌న్ (Mare of Easttown) స్ఫూర్తితో రూపొందుతున్న ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తుంది.

అయితే.. తాగాజా శ్రీకాకుళం నగరంలోని పాండురంగ వీధిలో ప్రారంభమైన ప్రముఖ వెల్నెస్ సంస్థ Kolors Healthcare 53వ‌ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యాధునిక సాంకేతికతతో బరువు తగ్గింపు, జుట్టు సమస్యలు, చర్మ సమస్యలకు చికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ సెంటర్‌ను ప్రారంభించినట్టు ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ, తాను సౌత్ ఇండియన్ ఆహారాన్ని ఎంతో ఇష్టపడతానని చెప్పారు. ముఖ్యంగా కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. మంచి ఆరోగ్యం, అందం కోసం సరైన జీవనశైలి ఎంతో అవసరమని ఆమె అన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నటనతో పాటు ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కూడా ఆమె ఎప్పుడూ శ్రద్ధ చూపుతాన‌ని, యోగా, సరైన డైట్, నియమిత జీవనశైలిని పాటించడం తన అలవాటని ఆమె చెబుతుంటారు.

Updated Date - Mar 14 , 2026 | 12:08 PM