Miracle: మిస్టరీగా 'మిరాకిల్'
ABN, Publish Date - Jan 13 , 2026 | 04:50 PM
రణధీర్ భీసు, హెబ్బా పటేల్, ఆకాంక్ష కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'మిరాకిల్'. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
రణధీర్ భీసు(Randir beesu), హెబ్బా పటేల్, ఆకాంక్ష కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'మిరాకిల్' (miracle). సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రమేష్ ఇగ్గిడి, చందర్ గౌడ్ నిర్మాతలు. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ 'యునిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదట ఇందులో సునీల్ ను కీలక పాత్రలో అనుకున్నాం. అయితే సునీల్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో వల్ల ఆయన స్థానంలో రోజాపూలు ఫేమ్ శ్రీరామ్ నటిస్తున్నారు. 21 నుంచి జరగబోయే రెండో షెడ్యూల్ లో శ్రీరామ్ (Sriram) మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాము. ఇందులో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా, మరో ముఖ్య పాత్రలో సీనియర్ యాక్టర్ సురేష్ గారు కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం అని అన్నారు. నాయుడు, జన కొల్లి ,యోగి కాత్రే , విజయ్ సూర్య, ఇంతియాజ్ , సాయి బాబా, దిల్ రమేష్, జాన్సీ , సూర్య నారాయణ, శ్రీధర్ , శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, బెజవాడ మస్తాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా సురేందర్ రెడ్డి, ఎడిటింగ్ విశ్వనాథ్, మ్యూజిక్ - ప్రభాస్.