జగపతిబాబు చేతుల మీదగా ‘కొణికి లక్స్’ స్కిన్ కేర్ ప్రారంభం
ABN, Publish Date - Apr 23 , 2026 | 09:31 PM
టాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొణికి ‘కొణికి లక్స్’ స్కిన్ కేర్‌ను జగపతిబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రారంభించారు.
టాలీవుడ్‌లో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన రామ్ కొణికి ఇప్పుడు కొత్త అడుగు వేశారు. ‘కొణికి లక్స్’ పేరుతో స్కిన్ కేర్ సర్వీసులను ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని తన సలూన్ వద్ద ఈ కొత్త విభాగాన్ని నటుడు జగపతిబాబు ప్రారంభించారు.
డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి ఆధ్వర్యంలో, ఆధునిక టెక్నాలజీ, సర్టిఫైడ్ పరికరాలతో పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ అందించనున్నట్లు రామ్ కొణికి తెలిపారు.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ, రామ్‌తో తన అనుబంధం ‘లెజెండ్’ సినిమా కాలం నుంచి ఉందన్నారు. అప్పటి నుంచి తన హెయిర్ స్టైల్స్ అన్నీ రామ్ చేతే జరిగాయని చెప్పారు. ఆయన పనితనం, వ్యక్తిత్వం మీద తనకు నమ్మకం ఉందని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
రామ్ కొణికి మాట్లాడుతూ, హెయిర్ స్టైలింగ్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నామని, ఇప్పుడు స్కిన్ కేర్ రంగంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. మెట్రో నగరాల్లో విస్తరించే ప్రణాళిక ఉందని వెల్లడించారు. ప్రొఫెషనల్ టీమ్, మెడికల్ గైడెన్స్‌తో అత్యాధునిక పరికరాల ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు.
డాక్టర్ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ, సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి కస్టమర్‌కు ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్స్ అందిస్తామని చెప్పారు. స్కిన్ కేర్‌కు సంబంధించిన అన్ని సర్టిఫైడ్ పరికరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.