నటి ఇంద్రజ చేతుల మీదుగా జుఒన్ సూపర్ యాప్
ABN, Publish Date - Oct 26 , 2026 | 07:05 AM
నటి ఇంద్రజ చేతుల మీదుగా JUONE సూపర్ యాప్ ప్రారంభమైంది.
రోజువారీ అవసరాల కోసం వేర్వేరు యాప్లు ఉపయోగించే పనిని తగ్గిస్తూ.. ఫుడ్ డెలివరీ నుంచి క్యాబ్ బుకింగ్, వైద్య సేవల నుంచి ఇంటి పనుల వరకు అనేక సదుపాయాలను ఒకే వేదికపై అందించేందుకు రూపొందించిన జుఒన్ (JUONE) సూపర్ యాప్ ప్రారంభమైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీర్లెస్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటి ఇంద్రజ ఈ యాప్ను ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, జుఒన్ బ్రాండ్ అంబాసిడర్ రాధికతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
‘వన్ యాప్.. మెనీ సొల్యూషన్స్’ అనే నినాదంతో ముందుకొచ్చిన జుఒన్లో ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, ఫార్మసీ, క్యాబ్ బుకింగ్, కార్లు–బైక్ల అద్దె, హోటళ్లు, రిసార్టుల రిజర్వేషన్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. షాపింగ్, పర్యాటకం, ఈవెంట్లు, హాస్టళ్లు, పీజీ వసతి బుకింగ్ సదుపాయాలను కూడా ఇందులో పొందవచ్చు.
ఇంటి శుభ్రత, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు, ఏసీ సర్వీసింగ్, పెస్ట్ కంట్రోల్, ప్యాకర్స్ అండ్ మూవర్స్తో పాటు మొబైల్, కంప్యూటర్ మరమ్మతు సేవలు కూడా ఈ యాప్లో ఉన్నాయి. డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలు, నర్సింగ్ సేవలను అందించే సదుపాయాలనూ ఇందులో పొందుపరిచారు. ఇలా వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే 25 రకాల సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చారు.
యాప్ ప్రారంభోత్సవంలో నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ప్రజల రోజువారీ అవసరాలకు అనుగుణంగా వివిధ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. జుఒన్ సూపర్ యాప్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉపయోగపడాలని, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుసంధానించడం ద్వారా సమయాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జుఒన్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక మాట్లాడుతూ.. ఆహారం, షాపింగ్, ప్రయాణం, ఆరోగ్యం, గృహ అవసరాలకు ఒకే యాప్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.
జుఒన్ సూపర్ యాప్ను నగరాలతో పాటు పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల వినియోగదారులకు చేరువ చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వేర్వేరు అవసరాల కోసం అనేక యాప్లను ఉపయోగించే ఇబ్బందిని తగ్గించి, సులభమైన డిజిటల్ సేవలను ఒకే చోట అందించడమే తమ ఉద్దేశమని ఫౌండర్, సీఈఓ పి. సురేంద్రబాబు తెలిపారు.
ప్రొప్రైటర్ బి. వివేక్ మాట్లాడుతూ.. ప్రయాణం, ఆహారం, షాపింగ్, వైద్యం, ఇంటి నిర్వహణ వంటి అవసరాలకు సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మొత్తంగా, ఒకే యాప్ ద్వారా అనేక రోజువారీ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో జుఒన్ సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.juone.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.