హద్దు దాటితే తాట తీస్తా.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Jul 14 , 2026 | 05:18 PM
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్(zareen Khan)కు ముంబైలో ఒక చేదైన అనుభవం ఎదురైంది. ముంబైలో జరిగిన ఒక సరికొత్త స్టోర్ ఓపెనింగ్ వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యింది.
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్(zareen Khan)కు ముంబైలో ఒక చేదైన అనుభవం ఎదురైంది. ముంబైలో జరిగిన ఒక సరికొత్త స్టోర్ ఓపెనింగ్ వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె అక్కడున్న కొన్ని డ్రెస్సులను పరిశీలిస్తుండగా, అక్కడకు చేరిన మీడియా ఫొటోగ్రాఫర్లలో ఒకరు ఆమె పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక డ్రెస్ చేతిలో పట్టుకొని జరీన్ ఖాన్ చూస్తూ ఉండగా సదరు ఫొటోగ్రాఫర్ ట్రయల్ వేయొచ్చుగా అంటూ హద్దులు దాటి కామెంట్ చేయడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఫొటోగ్రాఫర్ అన్న మాటలకు జరీన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సదరు వ్యక్తికి అక్కడికక్కడే అందరి ముందూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హద్దు దాటితే తాట తీస్తా అనే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చింది. 'ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు. నాతో మాట్లాడేటప్పుడు హద్దు దాటొద్దు' అంటూ కళ్లు ఎర్రజేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. జరీన్ ఖాన్ చూపించిన ఆ పవర్‌ఫుల్ అటిట్యూడ్, కోపానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు ప్రొఫెషనల్‌గా ప్రవర్తించాలే తప్ప, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులతో హద్దులు మీరితే ఊరుకునేది లేదని జరీన్ ఖాన్ ఈ ఘటనతో నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తప్పు చేసిన ఫొటోగ్రాఫర్‌కు సరైన బుద్ధి చెప్పావంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు జరీన్ ఖాన్‌కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఇక జరీనా తెలగులో గోపీచంద్ నటించిన చాణుక్య సినిమాలో నటించింది.