Ranbir Kapoor: ‘లవ్‌ అండ్‌ వార్‌’.. ‘రామాయణ’పై ప్రభావం చూపనుందా?

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:28 PM

రణబీర్‌ కపూర్‌ బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంతో రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే!

రణబీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రంతో రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే! నితేష్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్ర నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది దీపావళికి మొదటి పార్టు విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో పార్టు చిత్రీకరణకు ఇంకా సమయం ఉండడంతో రణబీర్‌ కపూర్‌ సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రం కమిట్‌ అయ్యారు. ఇందులో ఆయన గ్రే షేడ్‌లో కనిపిస్తారట. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి విడుదల చేయనున్నారు.

అయితే దీని వల్ల ‘రామాయణ’లో పాత్ర తాలుక భావోద్వేగాలు డిస్టర్భ్‌ అవుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నటుడిగా పాత్రకు తగ్గట్టు వేరియేషన్‌ చూపించడం, మౌల్డ్‌ కావడం రణ్‌బీర్‌ కపూర్‌లో ఉన్న బెస్ట్‌ క్వాలిటీ అని, అదే ఆయన బలమని మేకర్స్‌ చెబుతుంటారు. సో రెండు చిత్రాలకు ఆయన న్యాయం చేస్తారని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం రణ్‌బీర్‌ చేతిలో యానిమల్‌ పార్క్‌(2028), బ్రహ్మాస్త్ర-2(2029) చిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ అతని రేంజ్‌ను పెంచుతుందా? లేక ‘రామాయణం’ ఎమోషన్‌ను బ్రేక్‌ చేస్తుందా? అనేది తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాల్సిందే!  

Updated Date - Apr 18 , 2026 | 06:29 PM