పాపం.. టాలీవుడ్ వైపు చూడనంటున్న కియారా
ABN, Publish Date - Oct 03 , 2026 | 05:43 PM
సాధారణంగా బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సెటిల్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువమంది. ఒక పెద్ద స్టార్ హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారు. ఆ సినిమా తరువాత ఒక ప్లాప్ పడితే చాలు. ఇక చాలు టాలీవుడ్ అంటూ దూరం పెట్టేస్తారు.
సాధారణంగా బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సెటిల్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువమంది. ఒక పెద్ద స్టార్ హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారు. ఆ సినిమా తరువాత ఒక ప్లాప్ పడితే చాలు. ఇక చాలు టాలీవుడ్ అంటూ దూరం పెట్టేస్తారు. తాజాగా అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani) కూడా అదే లిస్ట్ లోకి చేరిపోయినట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమాతో కియారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత తెలుగులో అమ్మడికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో నటించింది. ఆ చిత్రం భారీ పరాజయన్ని అందుకుంది. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకొని మరోసారి చరణ్ తోనే గేమ్ ఛేంజర్ లో నటించింది. అది ఆమెకు పరాజయన్నే అందించింది. ఇక ఈ ఏడాది టాక్సిక్ తో వచ్చింది. అది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ఇక దీంతో కియారా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ప్రతిష్టాత్మక టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌కు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కాదు.. ఇటీవల కాలంలో ఈ అమ్మడు వరుసగా భారీ తెలుగు ఆఫర్లను తిరస్కరిస్తుందట. ఈ తిరస్కారానికి ప్రధాన కారణం డేట్ల సర్దుబాటు కాకపోవడమేనని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నప్పటికీ.. అందుతున్న సమాచారం ప్రకారం కియారా టాలీవుడ్ వైపు చూడనంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో పాటు పాన్ ఇండియా సినిమాలపైనే కియారా ఎక్కువ దృష్టి పెట్టిందని, కథ లేదా పాత్రలో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమే హీరోయిన్ పాత్రను పరిమితం చేయడంతో ఆమె ఈ భారీ ఆఫర్‌ను వదులుకున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.
ముఖ్యంగా పెళ్లి తర్వాత ప్రాజెక్ట్‌ల ఎంపికలో కియారా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సోలో పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే పాత్రలు, లేదా కంటెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. టాలీవుడ్ మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ, పాత్ర డిమాండ్, తన బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కియారా మరో రెండేళ్ల వరకు కూడా టాలీవుడ్ వైపు చూడదని, భవిష్యత్తులో సరైన ప్రాజెక్ట్, బలమైన కథ లభిస్తే తప్పకుండా మళ్లీ నేరుగా తెలుగు సినిమా చేస్తానని కియారా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏ టాలీవుడ్ డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను మెప్పించి మళ్లీ టాలీవుడ్‌కు తీసుకువస్తారో చూడాలి.