శ్రీదేవి ఉంటే.. జాన్వీ కెరీర్ వేరేలా ఉండేదా
ABN, Publish Date - Jun 05 , 2026 | 07:25 PM
ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఈ గైడెన్స్ చాలా అవసరం. అలాంటి గైడెన్స్ లేకనే చాలామంది రెండు మూడు సినిమాలకే కనుమరుగవుతున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఈ గైడెన్స్ చాలా అవసరం. అలాంటి గైడెన్స్ లేకనే చాలామంది రెండు మూడు సినిమాలకే కనుమరుగవుతున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలి.. ఆ సినిమాలో పాత్రలను ఎలా ఎంచుకోవాలి.. కథలు విన్నప్పుడు ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి.. అనేవి ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి. అయితే ఇవన్నీ కొత్తగా ఇండస్ట్రీలో వచ్చేవారికి.. నేపో కిడ్స్ కి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే .. వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడు వీటన్నింటిని వారసుల తల్లిదండ్రులు చూసుకుంటారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి ఇలాంటి గైడెన్స్ లేకనే ఆమె కెరీర్ అగమ్యగోచరంగా మారింది అని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. దానికి కారణం పెద్ది సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ముఖ్యం జాన్వీ అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక స్టార్ హీరోయిన్ కూతురు అయ్యి ఉండి.. ఆమె కేవలం అందాల ఆరబోత పాత్రలకే పరిమితమవ్వడం అస్సలు బాలేదని నెటిజన్స్ మండిపడుతున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తన కూతురిని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి పరితపించారు. కానీ, అది జరిగే లోపే ఆమె మరణించారు. తల్లి ఉంటే మాత్రం జాన్వీ కెరీర్ ఇలా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. బాలనటిగా కెరీర్ ని మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ గా శ్రీదేవి ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శం. ఆమె బతికుంటే తన కూతురు జాన్వీ కపూర్ కెరీర్, ఆమె ఎంచుకునే సినిమాల స్క్రిప్ట్ సెలక్షన్, నటన ఖచ్చితంగా మరో స్థాయిలో ఉండేవనడంలో సందేహం లేదు. సినిమా ప్రపంచంలోని ఒడిదొడుకులు అన్నీ బాగా తెలిసిన శ్రీదేవి గనుక తోడుగా ఉండి ఉంటే, జాన్వీకి ప్రతిరోజూ ఒక పర్‌ఫెక్ట్ మెంటార్‌లా ఉంటూ నటన, డాన్స్, డైలాగ్ డెలివరీలో మరింత కఠినమైన శిక్షణతో కూతురిని ఇండస్ట్రీలో ఒక తిరుగులేని స్టార్‌గా తీర్చిదిద్దేవారు.
శ్రీదేవి లేకపోయినా జాన్వీ.. చాలా గ్రాండ్ గానే టాలీవుడ్ లో లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ, ఆ స్టార్ హీరోల సినిమాల్లో ఆమె పాత్ర ఏంటి.. ? పాత్రకు ప్రాధాన్యత లేని కథలను ఎలా ఒప్పుకుంది. తల్లి శ్రీదేవి ఎలాంటి కథలను ఎంచుకొనేది.. ? ఎలాఎదిగింది.. ? ఎలాంటి ఐకానిక్ పాత్రలు చేసింది అనేది జాన్వికి తెలియంది కాదు. అయినా కూడా జాన్వీ ఇలాంటి గ్లామర్ పాత్రలను ఎంచుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి.. ?అనేది మిస్టరీగా మారింది. జాన్వీ కపూర్ తన స్వయంకృషితో, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోన్నా కూడా ఆమె తన తల్లి అంత స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం ఇలాంటి గ్లామర్ రోల్స్ కాకుండా పాత్రకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకోవాలి. మరి ఇకముందు అయినా జాన్వీ అందాల ఆరబోతకు స్వస్తి చెప్పి..తల్లిలా మంచి పాత్రలు చేస్తుందేమో చూడాలి.