Fatima Sana Shaik: తమన్నా మాజీ ప్రియుడితో ఫాతిమా.. అసలేం జరుగుతోంది

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:20 AM

బాలీవుడ్‌ నటి తమన్నా భాటియాతో ప్రేమాయణానికి ముగింపు పలికిన నటుడు విజయ్‌ వర్మ.. ఇప్పుడు మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారా?

బాలీవుడ్‌ నటి తమన్నా (Tamannaah) భాటియాతో ప్రేమాయణానికి ముగింపు పలికిన నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma). ఇప్పుడు మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అంటే బాలీవుడ్‌ వర్గాల్లో అవుననే అంటున్నాయి. నటి ఫాతిమా సనా షేక్‌తో విజయ్‌ వర్మ సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ రిలేషన్‌షిప్‌పై అటు విజయ్‌ వర్మ కానీ, ఇటు ఫాతిమా కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

విజయ్ వర్మ, తమన్నా దాదాపు మూడేళ్లు ప్రేమలో మునిగి తేలి ప్రేమ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసింది. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇప్పుడు ఎడమొహం పెడ మొహం అన్నట్లు ఉన్నారు. తాజాగా విజయ్‌ వర్మ పేరు ఫాతిమా సనా షేక్‌తో వినిపిస్తోంది. తమన్నాతో విడిపోయిన తర్వాత ఫాతిమాతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విజయ్‌ వర్మ కంటే ఫాతిమా సనా షేక్‌ ఎనిమిదేళ్లు చిన్న. మొత్తానికి తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్‌ వర్మ జీవితంలోకి మరో హీరోయిన్‌ వచ్చిందనే ప్రచారం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

విజయ్‌ – ఫాతిమా స్నేహం ఎలా మొదలైంది?

గతేడాది విడుదలైన ‘గుస్తాఖ్‌ ఇష్క్‌’ (Gustaakh Ishq) సినిమాలో విజయ్‌ వర్మ, ఫాతిమా సనా షేక్‌ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరితో ఒకరు చాలా త్వరగా కలిసిపోయామని విజయ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘మా ఇద్దరిలో ఒకేరకమైన చిలిపితనం ఉంది. మేమిద్దరం జోకులకు నవ్వుకుంటాం. మా చుట్టూ ఉన్నవారికి మేమెందుకు అంతగా నవ్వుతున్నామో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు మా నవ్వులు, జోకులు షూటింగ్‌కు ఇబ్బందిగా మారేవి’’ అని విజయ్‌ తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ వర్మపై ప్రశంసలు కురిపించారు ఫాతిమా. ఆయనలో తనకు బాగా నచ్చే లక్షణం ఏంటో వెల్లడించారు. 'విజయ్‌ వర్మ మంచి నటుడే కాకుండా, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకునే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యంగా ఆయనలో ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ చాలా ఎక్కువని చెప్పారు. ప్రస్తుతం ఫాతిమా సనా షేక్‌ ‘హుంకార్‌: ది రోర్‌’ (Hunkkaar: The Roar) అనే కోర్టు రూమ్‌ నేపథ్యంలో సాగే సామాజిక థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ALSO READ:

Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదే..

Black Gold: సినిమా విడుదల చేయాలంటే ఇన్ని అవరోధాలా?

MM Keeravani: 22 కిలోలు తగ్గిన కీరవాణి.. కొత్త లుక్‌ చూసి అనుపమ్ ఖేర్ షాక్

Updated Date - Nov 14 , 2026 | 10:21 AM