సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ధురంధర్' ద‌ర్శ‌కుడికి నో.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అల్లు అర్జున్

ABN, Publish Date - Mar 26 , 2026 | 06:47 AM

ధురంధర్ విజయాల జోరులో ఉన్న ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామను మళ్ళీ పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

allu arjun

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (Uri: The Surgical Strike) సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్యధర్ (Aditya Dhar). ఇప్పుడు ధురంధర్ సిరీస్‌ తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల బూజు దులిపేస్తున్నాడు. ధురంధర్ మొదటి పార్ట్‌ 1300 కోట్లు కలెక్ట్‌ చేయగా, ది రివేంజ్ ఆఫ్ ధురంధర్ (Dhurandhar The Revenge) కేవలం వారం రోజుల్లోనే 800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఈ వసూళ్లు చూస్తుంటే 2000 కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. అయితే, ఈ విజయాల జోరులో ఉన్న ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ (The Immortal Ashwatthama)ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ భారీ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథను ఆదిత్య ధర్ మొదట మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Vicky Kaushal) కి వినిపించడం, కథలోని కొత్తదనం, అశ్వత్థామ పాత్రలోని గాంభీర్యం నచ్చి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నుండి అల్లు అర్జున్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం బన్నీ చేతిలో ఉన్న ప్రస్తుత కమిట్‌మెంట్స్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్‌ కనగరాజు, సందీప్ రెడ్డి వంగా వంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది. అశ్వత్థామ వంటి భారీ ప్రాజెక్ట్‌కు కనీసం ఏడాదిన్నర సమయం కేటాయించాల్సి ఉంటుంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే బన్నీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని సినీ వర్గాల భోగట్టా.

బన్నీ తప్పుకోవడంతో, ఆదిత్య ధర్ మళ్ళీ తనకు మొదటి అవకాశం ఇచ్చిన విక్కీ కౌశల్ (Vicky Kaushal) ను రంగంలోకి దింపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విక్కీ కౌశల్ ఇప్పటికే ఉరితో తన సత్తా చాటాడు, గతేడాది వచ్చిన ఛావా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అశ్వత్థామ వంటి యోధానుయోధుడి పాత్రకు విక్కీ కౌశల్ ఫిజిక్ మరియు నటన ఖచ్చితంగా సెట్ అవుతాయని ఆదిత్యధర్‌ యూనిట్‌ భావిస్తున్నారట. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడవ్వడం ఈ సినిమాకు అతిపెద్ద బలం.

పురాణాల్లోని చిరంజీవి అయిన అశ్వత్థామ.. ఆధునిక కాలంలో ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం మైథాలజీ సినిమాలకు పాన్‌ ఇండియా వైడ్‌గా ఆదరణ విపరీతంగా ఉంది. మరి 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ విజువల్ వండర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది..? విక్కీ కౌశల్ కాకుండా మరే హీరో అయినా రేసులోకి వస్తారా..? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఆదిత్య ధర్ తన విజన్‌తో ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ కు పోటీగా తీసుకెళ్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Updated Date - Mar 26 , 2026 | 06:57 AM