Katrina Kaif- Vicky Kaushal: కొడుకు పేరు అధికారికంగా ప్రకటించిన మల్లీశ్వరి..
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:33 PM
బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రీనా కైఫ్ (Katrina Kaif) అభిమానులకు ఒక శుభవార్తను తెలిపారు. తమ ముద్దుల కుమారుడికి విహాన్ కౌశల్ (Vihaan Kaushal) అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
Katrina Kaif- Vicky Kaushal: బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రీనా కైఫ్ (Katrina Kaif) అభిమానులకు ఒక శుభవార్తను తెలిపారు. తమ ముద్దుల కుమారుడికి విహాన్ కౌశల్ (Vihaan Kaushal) అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. తమ చేతులలో చిన్నారి చేతిని ఉంచిన ఫోటోను షేర్ చేస్తూ ' మా కాంతి కిరణం, విహాన్ కౌశల్. మా ప్రార్థనలకు సమాధానాలు లభించాయి. జీవితం చాలా అందంగా మారింది. క్షణాల్లో మా ప్రపంచం మారిపోయింది. కృతజ్ఞత మాటల్లో చెప్పలేనిది' అంటూ రాసుకొచ్చారు. ఇక దీంతో అభిమానులు.. విహాన్ కౌశల్ పేరు బావుందని, కౌశల్ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అందాల హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తెలుగులో మల్లీశ్వరి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అందుకొని కత్రీనాను తెలుగువారి మనస్సులో మల్లీశ్వరిగానే నిలిచిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కుర్ర హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో పడ్డ కత్రీనా.. 2021 లో ఎంత ఘనంగా విక్కీని వివాహాం చేసుకుంది.
పెళ్లి తరువాత కూడా కత్రీనా సినిమాలు చేస్తూనే వచ్చింది. దాదాపు నాలుగేళ్ళ తరువాత .. అనగా గతేడాది సెప్టెంబర్ లో ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. నవంబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు విహాన్ అని పేరు పెట్టినట్లు కత్రీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.