సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అబ్సెషన్.. తెలుగు ఏం పాపం చేసింది

ABN, Publish Date - Oct 27 , 2026 | 09:35 PM

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకంటే థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా ఆ సినిమాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి మైండ్ బెండింగ్ హర్రర్ సినిమాల్లో 2025లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అబ్సెషన్’ (Obsession) ఒకటి.

Obsession

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకంటే థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా ఆ సినిమాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి మైండ్ బెండింగ్ హర్రర్ సినిమాల్లో 2025లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అబ్సెషన్’ (Obsession) ఒకటి. యూట్యూబర్ కర్రీ బార్కర్ (Curry Barker) దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో కూపర్ టామ్లిన్సన్, మేగాన్ లావ్లెస్ ముఖ్య పాత్రలు పోషించారు.


కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అతిపెద్ద రికార్డు సృష్టించింది. కాగా, ఈ హాలీవుడ్ సంచలన చిత్రం ఇప్పుడు అక్టోబర్ 30 నుంచి జియో హాట్ స్టార్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. అయితే, ఇది కేవలం హిందీ, ఇంగ్లీష్ లోనే డబ్ అవుతుంది. దీని హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కృతి సనన్ మెయిన్ క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పడం విశేషం.ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ సినిమాను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే డబ్ చేసి రిలీజ్ చేస్తుండటంపై సౌత్ ఆడియన్స్, ముఖ్యంగా తెలుగు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హిందీలోనే ఎందుకు డబ్ చేస్తున్నారు? తెలుగువారు హారర్ సినిమాలు చూడరా? అసలు తెలుగు వారు ఏం పాపం చేశారు? అని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.


ఈ సినిమా థియేట్రికల్ అండ్ ఇంటర్నెట్ రిలీజ్ సమయంలో టాలీవుడ్ ఆడియన్సే సోషల్ మీడియాలో దీనికి విపరీతంగా ప్రమోషన్ ఇచ్చి ట్రెండ్ చేశారు. అలాంటి సినిమాకు ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లేకుండా కేవలం హిందీకే ప్రాధాన్యత ఇవ్వడం తెలుగు ప్రేక్షకులను, సౌత్ ఆడియన్స్‌ను స్పష్టంగా అవమానించడమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా తెలుగులో కూడా వస్తుందేమో చూడాలి.

Updated Date - Oct 27 , 2026 | 09:41 PM