వరుణ్ ధావన్ సినిమాకు భారీ షాక్ | డేవిడ్ ధావన్‌పై రూ.400 కోట్ల కేసు |
ABN, Publish Date - May 31 , 2026 | 03:17 PM
వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం వివాదంలో చిక్కుకుంది.
వరుణ్ ధావన్ (Varun Dhawan), పూజా హెగ్డే (Pooja Hegde), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai) చిత్రం జూన్ 5న విడుదలవుతోంది. సినిమాలో పాటలు, ట్రైలర్ ఇప్పటికే విడుదలై, ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
ఒక పక్క ప్రమోషన్స్ చేస్తూ జోరు మీదున్న చిత్ర యూనిట్‌కు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. 1999లో వచ్చిన తమ సినిమా ‘బీవీ నంబర్ వన్’ పాటల్ని అనుమతి లేకుండా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో ఉపయోగించారని ఆరోపిస్తూ దర్శకుడు డేవిడ్ ధావన్ (David Dhawan)పై కేసు వేశారు. నష్టపరిహారం ఎంతో తెలుసా? రూ. 400 కోట్లు. సినిమాలో రెండు పాటలను తక్షణమే తొలగించడమే కాదు సినిమా పేరును కూడా మార్చాలని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిమాండ్ చేసింది.
ఒకవేళ దర్శకుడు డేవిడ్ ధావన్ ఇదేమీ పట్టించుకోకుండా ఆ పాటల్ని అలాగే ఉపయోగిస్తే అదనంగా మరో రూ వంద కోట్లు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సినిమా ప్రమోషన్స్ తక్షణమే నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోర్టును పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కోరింది. ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన వివాదం ఇదని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీవీ నంబర్ వన్’ చిత్రానికి కూడా డేవిడ్ ధావనే దర్శకుడు.