సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్ కి చేదు అనుభవం.. స్టేజిమీదనే లిప్ కిస్ ఇచ్చిన అభిమాని

ABN, Publish Date - Aug 09 , 2026 | 07:54 PM

సాధారణంగా పబ్లిక్ వేదికలపై తమ అభిమాన తారలను చూసినప్పుడు ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవ్వడం సహజం. ఎంతో అభిమానించే తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు కనిపించినప్పుడు వాళ్లను తాకాలని, ఫోటో దిగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

Nikita Rawal

సాధారణంగా పబ్లిక్ వేదికలపై తమ అభిమాన తారలను చూసినప్పుడు ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవ్వడం సహజం. ఎంతో అభిమానించే తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు కనిపించినప్పుడు వాళ్లను తాకాలని, ఫోటో దిగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా ఆశ ఉంటే అది వేరు. కానీ, కొన్నిసార్లు ఈ ఉత్సాహం హద్దులు దాటి సెలబ్రిటీలకు ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగిస్తోంది. తాజాగా ఒక అభిమాని.. ఒక హీరోయిన్ ని స్టేజీపైనే ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి అయ్యి ఉండి.. హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఎవరా హీరోయిన్ అంటే బాలీవుడ్ నటి నిఖిత రావల్ (Nikita Rawal). తాజాగా ఈ నాటికి స్టేజీపైనే చేదు అనుభవం ఎదురైంది.


ఒక ఈవెంట్‌లో నిఖిత రావల్ కెమెరాలకు పోజులిస్తుండగా, ఒక లేడీ ఫ్యాన్ హఠాత్తుగా స్టేజ్ పైకి దూసుకొచ్చింది. మొదట నిఖితను ఆత్మీయంగా కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సడెన్ గా సదరు అభిమాని ఒక్కసారిగా నిఖితకు లిప్ కిస్ ఇచ్చేసింది. ఈ ఊహించని పరిణామానికి నిఖిత ఒక్క క్షణం అయ్యి.. వెంటనే తేరుకుని ఆమెను విడిపించుకునే ప్రయత్నం చేయగా ఆ అభిమాని మరోసారి బుగ్గపై ముద్దు పెట్టింది. ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా ఆమె వదలలేదు. ఆ తరువాత కొద్దిసేపతికి ఆమె కిందకు వెళ్లిపోవడంతో నిఖిత అసహనంతో తన పెదవులను తుడుచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇక నిఖిత రావల్ గురించి చెప్పాలంటే.. పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినా మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా కాకుండా మంచి డ్యాన్సర్‌గా కూడా పేరున్న నిఖిత.. అమ్మా కి బోలి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఒక చిన్న స్థాయి హీరోయిన్ అయినప్పటికీ, ఒక అభిమాని నుంచి ఈ స్థాయిలో ఇలాంటి ప్రవర్తన ఎదుర్కోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated Date - Aug 09 , 2026 | 07:55 PM