టెర్రరిస్ట్ దాడి జరిగిన చోటే ట్రైలర్ విడుదల!

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:41 PM

పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ బయోపిక్‌ 'ప్రహార్‌: ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్‌ ఉజ్వల్‌ నికమ్‌' అక్టోబర్ 16న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్‌ చేశారు.

Prahaar Movie Trailer

జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ మరోసారి బయోపిక్‌లో నటించారు. అదే 'ప్రహార్‌ : ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్‌ ఉజ్వల్‌ నికమ్‌'. 2008 నవంబర్ 26న ముంబైలోని పలు ప్రాంతాల్లో పాక్ టెర్రరిస్టులు జరిపిన మారణకాండను ఎవరూ మర్చిపోలేరు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ కేసును స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ నికమ్‌ వాదించారు. కసబ్‌ కు ఉరిశిక్షపడేలా చేశారు. ఈ సంచలన కేసుకు సంబంధించిన వాదోపవాదాల నేపథ్యంలో తెరకెక్కిందే 'ప్రహార్‌' సినిమా.


అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్‌ చేశారు. 26/11 అటాక్స్ ను కళ్లకు కట్టినట్టు చూపించడమే కాకుండా కోర్ట్ డ్రామాను సైతం ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ (సి.ఎస్.ఎం.టీ.)లో ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే సెప్టెంబర్ 29న ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రాజ్‌ కుమార్‌ రావు భార్యగా వామికా గబ్బి, న్యాయమూర్తిగా ఆశిష్‌ విద్యార్థి, అజ్మల్‌ కసబ్‌ గా లలిత్ ప్రభాకర్‌, అతని తరఫు లాయర్‌ గా సికందర్ ఖేర్‌, పాకిస్తాన్ డెలిగేషన్‌ గా జైదీప్‌ అహ్లావత్‌ నటించారు. అవినాశ్‌ అరుణ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను దినేశ్‌ విజన్‌ నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం

Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది

బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆప‌డం క‌ష్ట‌మే!

Updated Date - Sep 30 , 2026 | 03:54 PM