సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tridha Choudhury: ఆ హీరోతో ఇంటిమేటెడ్ సీన్స్.. గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాను

ABN, Publish Date - Jul 07 , 2026 | 02:48 PM

సినిమాల్లో హీరోయిన్స్ కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి వస్తుంది. ఆ సీన్స్ వలన ఎంతోమంది వారిని ట్రోల్ చేస్తారు. ఇంకొన్నిసార్లు ఇంట్లోనే వారికి మద్దతు లభించదు.

Tridha Choudhury

సినిమాల్లో హీరోయిన్స్ కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి వస్తుంది. ఆ సీన్స్ వలన ఎంతోమంది వారిని ట్రోల్ చేస్తారు. ఇంకొన్నిసార్లు ఇంట్లోనే వారికి మద్దతు లభించదు. అలాంటి వారిలో తాను కూడా ఉన్నాను అని చెప్తోంది బాలీవుడ్ బ్యూటీ త్రిధా చౌదరి (Tridha Choudhary). తెలుగులో సూర్య వర్సెస్ సూర్య సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ లో బబితా పాత్రలో నటించి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది త్రిధా చౌదరి.


ఇక ఈ సిరీస్‌లో బాబీ డియోల్‌తో ఆమె చేసిన బోల్డ్ అండ్ ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేశాయో అందరికీ తెలిసిందే. అయితే, ఆ సీన్స్ తనకు తెచ్చిన క్రేజ్ కంటే.. తన వ్యక్తిగత జీవితంలో తెచ్చిన నరకం అంతా ఇంతా కాదంటూ త్రిధా తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆ ఇంటిమేట్ సీన్స్ కారణంగా తానెంతో మానసిక క్షోభను అనుభవించానని చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.


'ఈ సిరీస్‌లో బాబీ డియోల్‌తో నేను నటించిన బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి నా బాయ్‌ఫ్రెండ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఆ సీన్స్ అతనికి అస్సలు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ రియాక్షన్ నా మనసును పూర్తిగా ముక్కలు చేసింది. బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన నేను.. రోజులు తరబడి గదిలోనే ఉండి వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. ఒక నటిగా కెరీర్ కోసం చేసిన పాత్ర నావ్యక్తిగత బంధాన్ని అంతలా దెబ్బతీస్తుందని నేను ఊహించలేదు' అని బాధపడింది.


త్రిధా పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆ క్లిష్ట సమయంలో.. ఆమె క్లోజ్ ఫ్రెండ్ అజాన్ కొండంత అండగా నిలిచాడట. నిరంతరం ఏడుస్తూ డిస్టర్బ్ అవుతున్న త్రిధాను చూసి చలించిపోయిన అజాన్.. కొన్ని రోజుల పాటు ఈ సిటీ వాతావరణానికి దూరంగా తన దగ్గరకు వచ్చేయమని సలహా ఇచ్చాడని తెలిపింది. అతడి సపోర్ట్‌తోనే తాను ఆ మానసిక నరకం నుండి నెమ్మదిగా బయటపడగలిగానని త్రిధా చౌదరి చెప్పుకొచ్చింది. పప్రస్తుతం తాను బానే ఉన్నానని చెపుకొచ్చింది. ఇక త్రిధా వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుంటే.. ఇంకొందరు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. అలాంటి ఇంటిమెంటేడ్ సీన్స్ చేస్తే ఏ బాయ్ ఫ్రెండ్ అయినా అలాగే చేస్తాడని చెప్పుకొస్తున్నారు.

Updated Date - Jul 07 , 2026 | 03:31 PM