సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈవిల్ డెడ్.. చనిపోయాక కూడా నానా పటేకర్ ని వదలని హీరోయిన్

ABN, Publish Date - Oct 09 , 2026 | 08:06 PM

దిగ్గజ నటుడు నానా పటేకర్ గురువారం ఆకస్మికంగా కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన మరణంపై ఇండస్ట్రీ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.

Nana Patekar

దిగ్గజ నటుడు నానా పటేకర్ (Nana Patekar) గురువారం ఆకస్మికంగా కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన మరణంపై ఇండస్ట్రీ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. కానీ, ఒకే ఒక్కరు మాత్రం సైతాన్ చచ్చిపోయింది అని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె నటి తనుశ్రీ దత్తా (Thanushree Dutta). నానాజీ మరణించిన తరువాత ఆమె తన సోషల్ మీడియాలో ఈవిల్ డెడ్ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆమెపై చాలామంది సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. అయితే తానెందుకు అలా పోస్ట్ చేసిందో తెలుపుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది.


2008లో హార్న్ ఒకే ప్లీజ్ సినిమా సెట్స్‌లో నానా పటేకర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ 2018లో భారత్‌లో వచ్చిన మీటూ ఉద్యమం ద్వారా తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును పోలీసులు ముగించారు. ఆ సమయంలో నానాజీ తనకు నరకం చూపించాడని, ఆ బాధ తట్టుకోలేక సైతాన్ అని అన్నట్లు తెలిపింది. ఆ ఉద్యమం తర్వాత గత ఐదేళ్లుగా తాను అనుభవించిన నరకం తనకే తెలుసని, కేసు ఉపసంహరించుకోవడానికి తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని, మొదట డబ్బులతో లోబరుచుకోవాలని చూసినట్లు ఆరోపించింది. అది పనిచేయకపోవడంతో కిరాతక చర్యలకు పాల్పడ్డాడని.. తన కారు బ్రేకులు కట్ చేసి ప్రమాదానికి గురిచేశాడని, ఫుడ్ పాయిజనింగ్ కూడా చేశారని సంచలన నిజాలు బయటపెట్టింది


కోర్టు కేసు గురించి చెబుతూ.. తమ వైపు ఉన్న ముఖ్యమైన సాక్షి అయిన తన హెయిర్ డ్రెస్సర్‌ని ఒప్పించడానికి ఐదేళ్లు పట్టిందని, ఆమె కోర్టులో అఫిడవిట్ సమర్పించే రోజే జడ్జి కేసును ముగించారని విమర్శించింది.'నేను ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా నా దృష్టిలో ఆయన కేవలం ఒక సైతాన్ మాత్రమే. మనం భారతదేశంలో ఉన్నాం.. ఇక్కడ గెలిచిన వారే సరైనవారు కావాల్సిన అవసరం లేదు. కేవలం కేసు ముగిసినంత మాత్రాన నేను తప్పని, ఆయన ఒప్పని కాదు. ఆయన అత్యంత అహంకారి, వేధించడం ఆపకపోవడం వల్లే దేవుడే ఆయన ప్రాణాలు తీసేశాడు' అని తనుశ్రీ ముగించింది. ప్రస్తుతం తనుశ్రీ వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొందరు ఆమెకు మద్ధతు పలుకుతుంటే.. మరికొందరు చనిపోయాడు కదా.. ఇక వదిలేయ్ అని చెప్పుకొస్తున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 08:06 PM