Stree 2 Item Song: అల్లల్లాడించిన ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్!
ABN, Publish Date - Jan 17 , 2026 | 07:13 PM
స్త్రీ 2 సినిమాలో తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ 'ఆజ్ కీ రాత్' ఒక బిలియన్ వ్యూస్ ను పొందింది. వంద కోట్ల మార్క్ ను ఈ పాట క్రాస్ చేయడంతో తమన్నా వీక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
హిందీ సినిమా 'స్త్రీ 2' విజయంతో తమన్నా కూ ప్రత్యేక స్థానం ఉంది. ఆ చిత్రంలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ 'ఆజ్ కీ రాత్' యువతను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా సక్సెస్ రేంజ్ ను పెంచేసింది. ఆ పాట కోసమే ఈ సినిమాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళిన కుర్రకారు కూడా ఉన్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో తమన్నా నటిగా కంటే కూడా ఐటమ్ గర్ల్ గానే ఎక్కువ పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంది. తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా వచ్చేసింది. అందువల్లే కావచ్చు... కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి మరి తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
ఇదిలా ఉంటే తమన్నా భాటియా నర్తించిన 'ఆజ్ కీ రాత్' సాంగ్ యూ ట్యూబ్ లో వంద కోట్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. పైగా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ఈ పాటలోని బిట్స్ ఎన్ని బిలియన్ వ్యూస్ అందుకున్నాయో లెక్కేలేదు. ఈ పాట ఒక బిలియన్ వ్యూస్ ను పొందిన సందర్భంగా తమన్నా భాటియా షూటింగ్ విజువల్స్ ను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ పాటకు విజయ్ గంగూలీ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు సచిన్ - జిగర్ స్వరాలు సమకూర్చగా, మధుబంతి బాగ్చి, దివ్య కుమార్ ఆలపించారు. అమితాబ్ భట్టాచార్య ఈ పాటను అర్థవంతంగా రాశారు. ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా దీపక్ మిశ్రా దర్శకత్వంలో 'వి.వి.ఎ.ఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' మూవీలో నటిస్తోంది. మే 15న ఈ సినిమా విడుదల కాబోతోంది.