సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమన్నా రూటే సపరేటు!

ABN, Publish Date - Feb 10 , 2026 | 11:51 AM

మిల్కీ బ్యూటీ తమన్నా 'ఓ రోమియో'లో పారితోషికం తీసుకోకుండానే అతిథి పాత్రను పోషించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెలిపారు.

Tamannaah Bhatia

సినిమా అంటేనే పక్కా కమర్షియల్ అని అందరూ చెబుతుంటారు. అయితే... ఇక్కడ కూడా స్నేహానికి, అనుబంధానికీ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు ఉంటారని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కూడా అందుకు భిన్నమేమీ కాదు. స్నేహం కోసం పారితోషికం తీసుకోకుండానే సినిమా చేసే స్వభావం ఆమెదని ప్రముఖ దర్శక, నిర్మాత విశాల్ భరద్వాజ్ (Vishal Bhardwaj) తెలిపారు. ఇవాళ తమన్నా ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. తమన్నా సాంగ్ చేస్తే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అనే ప్రచారం సినిమా రంగంలో బాగా ఉంది. ఆమె స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలు సైతం అనేకం మంచి విజయాన్ని సాధించాయి. అయితే... ఇటీవల ఓ మూవీలో మాత్రం తమన్నా పారితోషికం లేకుండానే నటించిందట. అదే 'ఓ రోమియో' (O Romeo) హిందీ సినిమా!


షాహిద్ కపూర్ (Shahid Kapoor), త్రిప్తి డిమ్రీ (Triptii Dimri), నానా పటేకర్ (Nana Patekar) ప్రధాన పాత్రలు పోషించిన 'ఓ రోమియో' చిత్రంలో 'ట్వెల్త్ ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మస్సే, తమన్నా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. తనతో ఉన్న స్నేహం కారణంగా వీరిద్దరూ ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా తన చిత్రాలో నటించారని దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పారు. ఫిబ్రవరి 13న విడుదల కాబోతున్న 'ఓ రోమియో' సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా (Sajid Nadiadwala) నిర్మించారు. మరి విశాల్ భరద్వాజ్‌‌తో ఉన్న అనుబంధం కారణంగా అతిథి పాత్రను ఉచితంగా పోషించిన తమన్నాకు ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి. ఏదేమైనా... తనను విమర్శించే వారికి తాను డబ్బుల మనిషిని కాదని చేతలతో నిరూపించి తమన్నా షాక్ ఇచ్చింది!

Updated Date - Feb 10 , 2026 | 12:26 PM