సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తాప్సీ సీక్రెట్ మ్యారేజ్.. సినిమా ఛాన్స్ లు రావనే దాచిందా

ABN, Publish Date - Sep 28 , 2026 | 04:07 PM

తెలుగు చిత్రసీమలో కథానాయికగా ప్రయాణం ప్రారంభించి, తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను.

Taapsee Pannu

తెలుగు చిత్రసీమలో కథానాయికగా ప్రయాణం ప్రారంభించి, తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను(Taapsee Pannu). దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ఢిల్లీ భామ, ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే కమర్షియల్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలు చేయాలనే బలమైన కోరికతో ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.


బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత తాప్సీ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. 'పింక్', 'థప్పడ్', 'హాసిన్ దిల్‌రుబా', 'సాండ్ కీ ఆంఖ్' వంటి పవర్ ఫుల్ ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలతో హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతూ వరుస విజయాలను అందుకని లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.


ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, డానిష్ బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ మథియాస్ బోతో దాదాపు 11 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న తాప్సీ, 2024 మార్చిలో ఉదయ్‌పూర్‌లో అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఫోటోలను గానీ, వివరాలను గానీ సోషల్ మీడియాలో ఎక్కడా పంచుకోకపోవడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచడంపై రకరకాల పుకార్లు రాగా, తాజాగా ఈ సీక్రెట్ మ్యారేజ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని తాప్సి స్పష్టం చేసింది.


తన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండూ వేర్వేరుగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లిని సీక్రెట్‌గా ఉంచినట్లు తాప్సీ తెలిపింది. పెళ్లి అనేది పూర్తిగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయమని, దానిని పబ్లిక్ ఈవెంట్‌లా మార్చడం ఇష్టం లేకనే అత్యంత నిరాడంబరంగా, గోప్యంగా వివాహం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి ఫోటోలు పంచుకోవడం వల్ల తన ప్రైవసీ దెబ్బతింటుందని భావించానని, అందుకే పరిశ్రమకు దూరంగా ఈ వేడుకను నిర్వహించుకున్నానని స్పష్టం చేసింది. అయితే పెళ్లి విషయం తెలిస్తే సినిమాల్లో ఆఫర్లు తగ్గుతాయనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా,తాప్సీ మాత్రం ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.

Updated Date - Sep 28 , 2026 | 04:07 PM