సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి

ABN, Publish Date - Aug 08 , 2026 | 11:58 PM

హిందీ చిత్రసీమలో, బుల్లితెరపై నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన అత్యంత సంచలన, భావోద్వేగపూరిత విషయాలను పంచుకున్నారు.

Susmita Mukherjee

హిందీ చిత్రసీమలో, బుల్లితెరపై నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి (Senior Actress) సుస్మితా ముఖర్జీ (Susmita Mukherjee), ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన అత్యంత సంచలన, భావోద్వేగపూరిత విషయాలను పంచుకున్నారు. ‘‘మీరు కొన్ని చెత్త సినిమాల్లో, సరైన నాణ్యత లేని పాత్రల్లో ఎందుకు నటించారు?’’ అని ఒకరు తనను అడిగినప్పుడు తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనస్తాపానికి గురయ్యానని ఆమె వెల్లడించారు. అయితే, ఆ నిర్ణయాల వెనుక ఉన్న తన జీవిత తీవ్ర పరిస్థితులను, ఆర్ధిక ఇబ్బందులను ఆమె బహిరంగంగా వివరించారు.


2002వ సంవత్సరంలో తన భర్తతో కలిసి నడిపిన మీడియా ప్రొడక్షన్ కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని, ఒక్కసారిగా దాదాపు కోటి రూపాయల అప్పుల ఊబిలో పడిపోయామని ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి నిత్యం ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యేవని, ఆ అప్పులన్నీ తీర్చడానికి వేరే మార్గం లేక వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించాల్సి వచ్చిందని చెప్పారు. దానికి తోడు తన పిల్లల ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పంపడానికి కూడా చాలా డబ్బు అవసరమైందని, కుటుంబ బాధ్యతలు, అప్పుల భారం వల్లే మనస్సాక్షికి నచ్చకపోయినా కొన్ని చెత్త సినిమాల్లో నటించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే ఆ నిర్ణయాల పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని, నటిగా తన ఆత్మను చంపుకోవాల్సి వచ్చినా.. తన కష్టంతో అప్పులన్నీ తీర్చి, పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేశానని ధీమాగా చెప్పారు. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ డబ్బు సంపాదించడానికి రకరకాల కారణాలు, పారా మీటర్స్ ఉంటాయని.. కొందరు లగ్జరీ జీవితం కోసం సంపాదిస్తే, తాను మాత్రం కుటుంబ పోషణ, అప్పుల నుంచి బయటపడటానికే ప్రాధాన్యమిచ్చానని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడటంతో తన మనసుకు నచ్చిన, ఆత్మగౌరవాన్ని ఇచ్చే మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నానని సుస్మితా ముఖర్జీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..

స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే!

Updated Date - Aug 08 , 2026 | 11:58 PM