సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దివ్యాంగుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. క‌మెడియ‌న్‌, యూట్యూబర్లకు 3 లక్షల ఫైన్

ABN, Publish Date - Jul 15 , 2026 | 06:56 AM

దివ్యాంగులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో సమయ్ రైనా, రణ్వీర్ ఆలహాబాదియా, ఆశిష్ చంచలానిపై సుప్రీంకోర్టు రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది

Samay Raina

దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయట మేగాక, తమ ఆదేశాలను పాటించనందుకు కమెడియన్ సమయ్ రైనా (Samay Raina), యూట్యూబర్లు (YouTubers ) రణ్వీర్ ఆలహాబాదియా (Ranveer Allahbadia), ఆశిష్ చంచలా(Ashish Chanchlani) లపై సుప్రీం కోర్టు (Supreme Court) రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది. 'ఇండియా గాట్ టాలెంట్' పేరుతో నిర్వహించే ఓ షోలో సమయైనా.. స్పైనల్ మస్క్యు లర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే వ్యాధి చికిత్సకు అయ్యే భారీ వ్యయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎస్ఎంఏతో బాధపడే ఓ వ్యక్తిని ఆప హాస్యం చేశారని సుప్రీంకోర్టులో గతంలో ఓ వ్యాజ్యం దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇకపై ప్రతీ నెలలో రెండుసార్లయినా తమ షోలలో దివ్యాంగులు ముఖ్యంగా ఎస్ఎంఏ బాధితుల విజయగాథ లను పరిచయం చేయాలని, ఆ షోల ద్వారా వచ్చే డబ్బును ఎన్ఎంఏ బాధితల చికిత్సకు అందించాలని ఆదేశించింది. దివ్యాంగులను కించపరి చినందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లుగా షోలలో ప్రకటించాలని పేర్కొంది.

ఈ ఆదేశాలను సమయ్ రైనాతోపాటు ఇతర యూట్యూబర్లు పాటించలేదని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా.. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆదేశాలు పాటిస్తామంటూ తమకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారని, ఇది అహంకారం తప్ప మరొకటి కాదని సీజేఐ పేర్కొ న్నారు. కాగా, దివ్యాంగుల గౌరవాన్ని పరిరక్షించటం కోసం ఎస్సీ ఎస్టీ చట్టం తరహాలో కఠినమైన చట్టం తీసుకొచ్చే అంశంపై యోచించాలని ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి సూచించింది.

Updated Date - Jul 15 , 2026 | 06:56 AM