సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunny Leone: హాట్ బ్యూటీ సన్నీ వ్యాఖ్యాతగా స్ప్లిట్స్‌ విల్లా

ABN, Publish Date - May 21 , 2026 | 11:11 AM

భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన బిగ్గెస్ట్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌ విల్లా’ (MTV Splitsvilla) సరికొత్త ట్విస్టులతో, మరింత బోల్డ్‌గా, స్పైసీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sunny leone

భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన బిగ్గెస్ట్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌ విల్లా’ (MTV Splitsvilla) సరికొత్త ట్విస్టులతో, మరింత బోల్డ్‌గా, స్పైసీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షో 16వ సీజన్‌ను ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యారా పైసా’ పేరుతో ఘనంగా ప్రారంభించింది. ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే, మొదటిసారిగా ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మే 12 నుండి ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు ‘జియో హాట్‌స్టార్’(JioHotstar), ఎమ్‌టీవీ ఛానల్‌లో ప్రసారమవుతోంది.

తమిళనాడులోని మహాబలిపురం తీర ప్రాంతంలో ఈ సీజన్ షూటింగ్ జరిగింది. ఈసారి షోలో పాల్గొనేందుకు 33 మంది హాట్, సింగిల్ యువతీ యువకులు ఎంపికయ్యారు. గత సీజన్ ముగింపులో కంటెస్టెంట్లు దిగ్విజయ్, కాశీష్ వదిలివెళ్లిన ఉత్కంఠభరితమైన మలుపు ఆధారంగా ఈ కొత్త సీజన్ రూపుదిద్దుకుంది. ఇందులో కంటెస్టెంట్లను ‘ప్యార్ విల్లా’ (ప్రేమ విల్లా), ‘పైసా విల్లా’ (డబ్బువిల్లా) అనే రెండు విభాగాలుగా విభజించారు. ప్రేమ, డబ్బు మధ్య జరిగే ఈ ఆసక్తికరమైన పోరాటంలో ఎవరు గెలుస్తారు? ఎవరు తమకు జోడీని వెతుక్కుంటారు? అనేది ఈ సీజన్ ముఖ్య కథాంశం.


 ఈ రియాలిటీ షోకు ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ సన్నీ లియోన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోతో ఆమెకు పదేళ్ల సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈసారి ఆమెతో పాటు‘కింగ్ ఆఫ్ హార్ట్స్’ కరణ్ కుంద్రా కో-హోస్ట్‌గా జోడై షోలో సరికొత్త జోష్ నింపారు. వీరికి తోడుగా షోలో డ్రామా, గందరగోళం, ట్విస్టులను పెంచడానికి ‘మిస్చిఫ్ మేకర్స్’గా పాపులర్ సెలబ్రిటీలు నియా శర్మ, ఉర్ఫీ జంటగా రంగంలోకి దిగారు.

ఈ సందర్భంగా హోస్ట్ సన్నీ లియోన్ మాట్లాడుతూ 'స్ప్లిట్స్‌ విల్లా నా హృదయానికి దగ్గరైన షో. ఈతరం యువతలో ప్రేమ, బంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు కాలానికి అనుగుణంగా ఎలా మారుతున్నాయో ఈ షో ప్రతిబింబిస్తుంది. ఈ సీజన్‌లో తీసుకొచ్చిన ‘ప్యార్ యా పైసా’ (ప్రేమ లేదా డబ్బు) అనే ట్విస్ట్ కంటెస్టెంట్ల భావోద్వేగాలకు, బంధాలకు పెద్ద పరీక్షగా నిలవబోతోంది. ఎన్నో ఊహించని సర్ప్రైజ్‌లతో రాబోతున్నఈ సరికొత్త డ్రామాను వీక్షించడానికి అభిమానులు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు.  

Updated Date - May 21 , 2026 | 12:41 PM