Sunny Deol: లుక్‌తోనే లెక్కలు మార్చేస్తున్న సన్నీ డియోల్.. సూర్యా విశ్వరూపం...
ABN, Publish Date - Oct 12 , 2026 | 04:52 PM
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ (Sunny deol) మరోసారి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ (Sunny deol) మరోసారి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూర్యా’(Suryaa). ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో సన్నీ డియోల్ ఇంటెన్స్, రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో ఆయన కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సన్నీ డియోల్ అంటేనే గుర్తొచ్చేది పవర్‌ఫుల్ యాక్షన్, గంభీరమైన డైలాగులు, శత్రువులను ఎదుర్కొనే ధైర్యం. అలాంటి హీరో ఇప్పుడు ‘సూర్యా’లో మరో భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా కథ, పాత్ర కు సంబంధించిన పూర్తి వివరాల గురించి త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి పద్మకుమార్ మంఘాట్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపక్ ముకుట్, హెమ్మంత్ ముకుట్, లోకేశ్ ముకుట్, కమల్ ముకుట్ నిర్మాతలు. నవంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.