Sunny Deol - Jyothika: సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టే థ్రిల్లర్..
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:04 PM
బాలీవుడ్‌లో (Bollywood) మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది.
బాలీవుడ్‌లో (Bollywood) మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాతలు రితేష్ సిద్థ్వానీ ఫరాన్ అక్తర్ దర్శకనిర్మాత ఎ.ఆర్.మురుగదాస్‌తో కలిసి ఈ చిత్రం రూపొందుతోంది. బాలాజీ గణేష్ (Balaji Ganesh)దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సన్నీ డియోల్ (Sunny deol), జ్యోతిక (jyothika) జంటగా నటించనున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని, సీట్ ఎడ్జ్‌తో కూర్చోబెట్టే అంతగా థ్రిల్ కలిగిస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
రితేష్ సిద్థ్వానీ, ఫరాన్ అక్తర్, ఏ.ఆర్. మురుగదాస్ కలిసి బాలీవుడ్‌లో చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే టైటిల్, మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.
ALSO READ: Chiranjeevi: విశ్వంభర విడుదలపై చిరు క్లారిటీ.. డేట్ ఫిక్స్
Sudev Nair: నెగటివ్ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచాడు.. మెప్పిస్తున్నాడు..
Bobby Kolli: చిరంజీవికీ నచ్చిన హీరో ఎవరో తెలుసా.. దర్శకుడి క్లారిటీ