Srimad Bhagavatam: సాగర్ పిక్చర్స్.. భారీ ప్రాజెక్ట్!
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:22 AM
రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ 'శ్రీమద్ భాగవతం'ను ఏడు భాగాల సినిమాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. 'సప్త' పేరుతో ఈ చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
90లలో ‘రామాయణ్’ (Ramayan) టీవీ సీరియల్ గుర్తుంది కదూ. హిందీలో రూపుదిద్దుకున్న ఈ ధారావాహిక తెలుగు ప్రేక్షకులను సైతం అలరించింది. ఈ సీరియల్‌ను దర్శకనిర్మాత రామానంద సాగర్ అందించారు. ఇప్పుడు ఆయన కుటుంబానికి చెందిన సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (Sagar Pictures Entertainment) సంస్థ మరో ఇతిహాసం భాగవతాన్ని ఏడు భాగాలుగా ‘శ్రీమద్ భాగవతం’ (Srimad Bhagavatam) పేరుతో తీయనున్నట్లు ప్రకటించింది.

గురు పూర్ణిమ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ అత్యంత ప్రామాణికంగా ఈ ఏడు చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది. భాగవత సప్తాహ పారాయణం ఏడు రోజుల పాటు నిర్వహించే సంప్రదాయం దశాబ్దాలుగా ఉంది కనుక ఆ స్పూర్తితో రూపొందించే ఈ ప్రాజెక్ట్‌కు ‘సప్త’ అని నామకరణం చేశారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని సాగర్ సంస్థ ప్రకటించింది.