Bollywood: పాన్ ఇండియాగా 'దాదా - ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:27 AM

సౌరవ్ గంగూలీ పుట్టినరోజును పురస్కరించుకుని అతనిపై తెరకెక్కబోతున్న 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

Dada: The Sourav Ganguly Story Poster

లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రను పోషించబోతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గంగూలీ అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను వచ్చే యేడాది మే 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

అధికారికంగా విడుద‌ల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసి చూపించారు. ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్‌లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తులుగా మిగిలాయి.


‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమా క్రికెట్‌ ఆట ఆడిన వ్యక్తి మాత్రమే కాకుండా దానిని మార్చిన మనిషి అసాధారణ ప్రయాణాన్ని చూపించబోతోంది. ఒక ప్రతిభావంతుడైన యువ క్రికెటర్‌గా ప్రారంభమై భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన గంగూలీ ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించబోతోంది. పట్టుదల, పోరాడే శక్తి, నమ్మకం వంటి లక్షణాలు భారత క్రికెట్‌ను ఎలా కొత్తగా మలిచాయో, ఒక తరం మొత్తానికి ఎలా ప్రేరణగా నిలిచాయో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

WhatsApp Image 2026-07-08 at 10.25.44 AM.jpeg

‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమాకు విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో, లవ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’.. అంత‌ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

మహేష్ మమ్మల్ని మోసం చేశాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మరదలు

Anjali: అతను రాఖీ కట్టినా వదలలేదు

Updated Date - Jul 08 , 2026 | 11:30 AM