Anjali: అతను రాఖీ కట్టినా వదలలేదు

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:32 PM

ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఏ హీరోతో సినిమా చేసినా వారితో రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు పుట్టిస్తూనే ఉంటారు. తెలుగు అందం అంజలి (Anjali) విషయంలో కూడా అదే జరిగింది.

Anjali

ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఏ హీరోతో సినిమా చేసినా వారితో రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు పుట్టిస్తూనే ఉంటారు. తెలుగు అందం అంజలి (Anjali) విషయంలో కూడా అదే జరిగింది. ఆమె కెరీర్ మొదలుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎవరో ఒకరితో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వస్తోనే ఉన్నాయి. అంజలి వాటిని తిప్పికొడుతూనే ఉంది. తాజాగా మరోసారి అంజలి.. తన పెళ్లి గురించి, అఫైర్స్ గురించి వస్తోన్న పుకార్లపై స్పందించింది,


అంజలి నటించిన తమిళ చిత్రం మగుడం. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో మకుటం పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో ఆమె తనపై వస్తున్న ప్రేమ, పెళ్లి రూమర్లపై ఓపెన్ అయ్యింది. ఇండస్ట్రీలో హీరోలతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు చాలా వార్తలు వచ్చాయని, ఆ రూమర్స్ తనను ఎంతో బాధపెట్టాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "నాకు ఒకరితో అఫైర్ లేదు అని చెప్తే మీరు ఇంకొకరి గురించి అడుగుతారు.. అందుకే నేను ఎవరి పేరూ చెప్పానుకోవడం లేదు. ఒక్కటి అయితే చెప్తాను. ప్రస్తుతం నా జీవితంలో అయితే ఎవరూ లేరు" అని క్లారిటీ ఇచ్చింది.


ఇక తన జీవితంలో జరిగిన ప్రపోజల్ గురించి చెప్పమంటే చెప్తాను అని అంజలి తన స్కూల్ డేస్‌లో జరిగిన ఒక లవ్ ప్రపోజల్ గురించి చెప్పి నవ్వులు కురిపించింది. ఆమె స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక క్లాస్‌మేట్ ఆమెకు వరుసగా లవ్ ప్రపోజ్ చేస్తూ వెంటపడేవాడట. ఒకరోజు ఆ అబ్బాయి అంజలికి ఏకంగా ఒక సవాల్ విసిరాడట.. నీకు నిజంగా ధైర్యముంటే నాకు రాఖీ కట్టి చూడు అని ఛాలెంజ్ చేయడంతో, అంజలి ఏమాత్రం ఆలోచించకుండా నిజంగానే అతనికి రాఖీ కట్టేసిందట. రాఖీ కడితే ఇక ఆ అబ్బాయి అన్నయ్య వరుస అవుతాడు కాబట్టి తన వెంట పడటం ఆపేస్తాడని అంజలి భావించిందట. కానీ, అక్కడే అసలైన సీన్ రివర్స్ అయిందని అంజలి నవ్వుతూ చెప్పుకొచ్చింది. అంజలి రాఖీ కట్టిన వెంటనే ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా, ఆ రాఖీని చేతి నుంచి తీసేసి తిరిగి ఆమె చేతికే ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడట.. ఈ విషయాన్ని చెప్పి అంజలి సరదాగా నవ్వేసింది. మరి మకుటం సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 07 , 2026 | 04:33 PM