సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సిగ్గు చేటు.. కంగనాపై సోనూసూద్ ఫైర్

ABN, Publish Date - Jul 29 , 2026 | 09:07 PM

భాజపా ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కి వివాదాలు కొత్త కాదు. వివాదాలు లేకపోతే ఆమె నిద్రపోదు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె అస్సలు మారలేదు.

Sonu Sood

భాజపా ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కి వివాదాలు కొత్త కాదు. వివాదాలు లేకపోతే ఆమె నిద్రపోదు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె అస్సలు మారలేదు. తాజాగా కంగనా జెన్-జీ (Gen Z) యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇటీవల జంతర్‌మంతర్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న యువతను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. నిరసనల్లో పాల్గొంటున్న యువతను కంగనా గట్టర్ జనరేషన్ అని సంబోధిస్తూ, వారి రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయని, యువత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శించింది. దీంతో కంగనాపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.


తాజాగా రియల్ హీరో సోనూ సూద్ సైతం కంగనా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కంగనా తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. ఒకవేళ కంగనా నిజంగానే ఆ మాటలు అని ఉంటే అది చాలా సిగ్గుచేటని సోనూ సూద్ మండిపడ్డాడు. నటులను, నాయకులను స్టార్‌లుగా నిలబెట్టేది ఈ యువతేనని, నోరు జారే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికాడు.


'యువత మీ వెన్నంటి ఉన్నంత కాలమే మీరు ఎదుగుతారు, ప్రజలే దేవుళ్లు.. కాబట్టి ప్రతీ ఒక్కరినీ కలుపుకొనిపోవాలి.. వారు లేకపోతే మనమెక్కడ.. వృత్తి ఎలాంటిది అయినా కూడా ప్రజలతోనే కలిసి ఉండాలి' అని సోనూ సూద్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సోనూ సూద్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయనకు చాలామంది మద్దతు పలుకుతున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 09:12 PM