సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దుబాయ్‌లో ఉన్నవారికి సాయం.. ఉచిత వసతి

ABN, Publish Date - Mar 05 , 2026 | 11:44 AM

కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్‌ (Sonusood) దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతగా ఆదుకున్నారో తెలిసిందే! వలస కార్మికులకు ఆయన అండగా నిలిచారు.

Sonusood

కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్‌ (Sonusood) దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతగా ఆదుకున్నారో తెలిసిందే! వలస కార్మికులకు అండగా ఆయన నిలిచారు. ఎంతో మందికి ఉపాధి చూపించారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల ద్వారా తమ ఇళ్లకు చేర్చారు. ఇలా ఆపదలో ఉన్న వారికి 'నేనున్నాను' అంటూ అండగా నిలిచి.. తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పుడు యుద్థ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్ లో  చిక్కుకుపోయినా ప్రయాణికులకు ఆయన సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉచితంగా వసతి కల్పిస్తామని ప్రకటన చేశారు.


ఏ దేశస్థులైనా సరే, ఎలాంటి షరతులు లేకుండా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘కష్ట సమయంలో మనసున్న మనిషిగా ముందుకు రావడం ఎంతో అవసరం. సహాయం అవసరమైనవారు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా డిటైల్స్‌తో మెసేజ్‌ చేయండి. మా టీమ్‌ తక్షణమే స్పందిస్తారు’ (Humanity first) అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 03:48 PM