సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..

ABN, Publish Date - Aug 10 , 2026 | 10:16 PM

నటీనటులు వెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎంతో శ్రమ, కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు దాగి ఉంటాయి. హీరో అయినా హీరోయిన్ అయినా సెట్ లో చాలా కష్టపడుతుంటారు.

Shehnaaz Gill

నటీనటులు వెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎంతో శ్రమ, కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు దాగి ఉంటాయి. హీరో అయినా హీరోయిన్ అయినా సెట్ లో చాలా కష్టపడుతుంటారు. అలా కష్టపడే సమయంలో అనుకోని ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్ (Shehnaaz Gill) తన నూతన చిత్రం ఇష్క్‌నామా (Ishqnama) చిత్రీకరణలో ఒక భయానక పరిస్థితిని ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారింది.


అరవిందర్ ఖైరా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పంజాబీ పీరియడ్ రొమాంటిక్ డ్రామా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక రన్నింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా, షెహనాజ్ ధరించిన సాంప్రదాయ ఆభరణం అయిన ముక్కుపుడక జారి ఆమె నోట్లోకి వెళ్లి గొంతులో అడ్డుపడింది. ఊపిరి తీసుకోవడం కష్టమై ఆమె విపరీతంగా దగ్గుతూ ఇబ్బంది పడింది.ఆ క్షణంలో అక్కడే ఉన్న సహ నటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించి, ఆమె వీపు తడుతూ ఆ వస్తువు బయటకు వచ్చేలా సహాయం చేశాడు. ఆయన సమయస్ఫూర్తి కారణంగా పెద్ద ప్రమాదం తప్పి షెహనాజ్ సురక్షితంగా కోలుకున్నట్లు సమాచారం. ఈ బిహైండ్ ది సీన్స్ క్లిప్‌ను షెహనాజ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానులు ఆమె క్షేమంగా ఉన్నందుకు సంతోషిస్తూ జాగ్రత్త అని కామెంట్స్ చేస్తున్నారు.


సాధారణంగా చారిత్రక లేదా పౌరాణిక చిత్రాల షూటింగ్ సమయంలో భారీ ఆభరణాలు ధరించి డ్యాన్స్ లేదా రన్నింగ్ సీన్లు చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే సమయానికి కో-స్టార్ స్పందించడంతో దేవుడి దయ వల్ల షెహనాజ్ సురక్షితంగా బయటపడిందని అభిమానులు, శ్రేయోభిలాషులు ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్స్ చేస్తున్నప్పుడు నటీనటులు జాగ్రత్త వహించాలని పలువురు చెప్పుకొస్తున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 10:21 PM