షాహిద్ సరసన జాన్వీ!
ABN , Publish Date - May 07 , 2026 | 05:49 PM
బాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతోంది. ఎవరూ ఊహించని జోడీ తెరపైకి రాబోతోంది. అన్ని కుదిరితే అతి త్వరలోనే అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇంతకీ అంతలా ఊరిస్తున్న ఆ క్రేజీ కాంబో ఏంటో తెలుసా!?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు సెట్స్ మీదకు రాక ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. అలాంటిదే ఇప్పుడు బీటౌన్ లో జరగబోతోంది. స్టార్ హీరో షాహీద్ కపూర్, జాన్వీ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాదు ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందట.
'బధాయి హో', 'మైదాన్' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు అమిత్ శర్మ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్నాడు. రొమాంటిక్ కామెడీగా ఇది ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆధునిక సంబంధాలు, ప్రేమ, వినోదం కలగలిపి యువతకు బాగా కనెక్ట్ అయ్యే ఫ్రెష్ స్టోరీని మేకర్స్ సిద్ధం చేస్తున్నారట.ఈ మూవీ షూటింగ్ ఈ యేడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. దీనిని 2027లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారట.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతోందట. షాహిద్ కపూర్ చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ జానర్‌లో మూవీ చేయబోతున్నాడని చెబుతున్నారు. కొంతకాలంగా సీరియస్ రోల్స్ కు పరిమితమైన షాహిద్ కపూర్ ను మళ్ళీ కామెడీ అవతార్‌లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు. జాన్వీ కపూర్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న విడుదల కాబోతోంది. ఆ తర్వాత షాహిద్ కపూర్ సినిమా అధికారికంగా అనౌన్స్ అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి షాహిద్ - జాన్వీ కాంబినేషన్ బాలీవుడ్‌కు కొత్త వైబ్ ఇవ్వనుంది.
ఇవి కూడా చదవండి:
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్
Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?