మా రష్మికనే ఏడిపిస్తావా.. ఎంత ధైర్యం నీకు షాహిద్
ABN, Publish Date - May 30 , 2026 | 09:43 PM
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను వివాహమాడి తెలంగాణ కోడలింగా మారిన విషయం తెల్సిందే.
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను వివాహమాడి తెలంగాణ కోడలింగా మారిన విషయం తెల్సిందే. ఇక పెళ్ళి తరువాత కూడా అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న బాలీవుడ్ మూవీ కాక్ టైల్ 2. షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి సనన్ మరొక హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ మధ్యనే కాక్ టైల్ 2 ప్రమోషన్స్ లో షాహిద్ కపూర్, రష్మిక కలిసి మీడియాకు ఫోటోలు ఇస్తున్నప్పుడు.. షాహిద్ సరదాగా రష్మిక భుజంపై చేయి వేశారు. అయితే ఆ సమయంలో రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు నటిస్తూ, వెంటనే చిరాగ్గా వెనక్కి జరిగి ఆయన చేతిని పక్కకు తప్పించింది. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య ఏవైనా కోల్డ్ వార్స్ నడుస్తున్నాయా.. లేకపోతే రష్మికని షాహిద్ ఇబ్బందికి గురిచేస్తున్నాడా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే తాజాగా ఈ వార్తలకు షాహిద్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని మరొక వీడియోతో స్పష్టం చేశాడు. తాజాగా ముంబైలో మరో హీరోయిన్ కృతి సనన్‌తో కలిసి పాల్గొన్న ఈవెంట్‌లో.. షాహిద్ కావాలనే పాత సంఘటనను గుర్తుచేస్తూ రష్మికను ఆటపట్టించాడు. మీడియా ముందు ఫోటోలకు పోజులిచ్చే సమయంలో రష్మిక ఎలాగైతే తన చేతిని చిరాగ్గా తీసేసి వెనక్కి జరిగిందో.. సరిగ్గా అలాగే యాక్ట్ చేస్తూ అందరి ముందు వెనక్కి తిరిగి సేమ్ రష్మిక ఎక్స్ ప్రెషన్స్ ను ఇమిటేట్ చేశాడు. దీంతో రష్మిక ఏడుపు ముఖం పెట్టింది.
షాహిద్ చేసిన ఈ ఊహించని ఫన్నీ కౌంటర్‌తో పక్కనే ఉన్న కృతి సనన్ పగలబడి నవ్వగా, రష్మిక అప్పుడు తాను కావాలని చేయలేదని, తనని వదిలేయమని కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తెలుగుఅభిమానులు .. ఎంత ధైర్యం .. మా రష్మికనే ఏడిపిస్తావా.. మా రౌడీ అన్నా వచ్చాడు అంటే అంతే అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.