సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాలీవుడ్ దిగ్గజాల సరసన షారుక్ ఖాన్.. ప్రపంచ టాప్ 100లో ఏకైక భారతీయుడిగా ఘనత!

ABN, Publish Date - Nov 20 , 2026 | 06:09 AM

అంతర్జాతీయ మీడియా సంస్థ వెరైటీ ప్రకటించిన 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ జాబితాలో షారుక్ ఖాన్ 92వ స్థానం దక్కించుకున్నారు.

Shah Rukh Khan

తనదైన నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) మరో అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఆయనకు తాజాగా మరో గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెరైటీ (Variety Magazine) రూపొందించిన 'ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్' జాబితాలో షారుక్ ఖాన్ చోటు సంపాదించారు.

ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ఆయన 92వ స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు, ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ నటుడిగా నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటీనటులతో పాటు షారుక్ ఖాన్‌కు స్థానం కల్పించడం భారతీయ సినీ అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

మరో విశేషం ఏమిటంటే.. ఈ జాబితాలో షారుక్ ఖాన్ పలువురు హాలీవుడ్ ప్రముఖుల కంటే ముందున్నారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ 99వ స్థానంలో, ఎడ్డీ మర్ఫీ 96వ స్థానంలో నిలవగా.. షారుక్ 92వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు జొవాక్విన్ ఫీనిక్స్, ఎమ్మా స్టోన్, ఫిలిప్ సెయ్మార్ హాఫ్‌మన్ వంటి ప్రముఖుల సరసన కూడా ఆయన పేరు నిలవడం విశేషం.

కాగా, షారుక్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ఆయన సినిమాల్లో రెండు చేతులు చాచి నిలబడే ఐకానిక్ ఫోజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రేమకథలు, యాక్షన్ చిత్రాలు, ఎమోషనల్ డ్రామాలతో ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించిన ఆయన తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. ఇప్పుడు వెరైటీ జాబితాలో చోటు దక్కించుకోవడంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటారు.

Updated Date - Nov 20 , 2026 | 06:09 AM