సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh Babu: మహేశ్‌పై భన్సాలీ కన్ను.. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌తో సినిమా కోసం భారీ స్కెచ్‌!

ABN, Publish Date - Sep 15 , 2026 | 01:57 PM

సంజయ్‌ లీలా భన్సాలీ పేరు వినగానే దేవదాస్‌, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌, బ్లాక్‌, రామ్‌-లీలా, గంగూబాయి కాఠియావాడి వంటి చిత్రాలు గుర్తొస్తాయి.

సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) పేరు వినగానే దేవదాస్‌, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌, బ్లాక్‌, రామ్‌-లీలా, గంగూబాయి కాఠియావాడి వంటి చిత్రాలు గుర్తొస్తాయి. భారీ సెట్లు, గ్రాండ్‌ విజువల్స్‌, పవర్‌ఫుల్‌ ఎమోషన్స్‌ ఇవన్నీ ఆయన చిత్రాల్లో ప్రత్యేకతలు. తన సినిమాల్లో ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తారు. ఆయన సినిమాలో స్టార్‌ హీరో ఉన్నా.. కమర్షియల్‌ ఫార్ములా జోలికి వెళ్లకుండా ఆ హీరోను కథలో భాగం చేసి కథ ఆ పాత్ర చుట్టే తిరిగేలా చేయడం ఆయన మ్యాజిక్‌. ఆయన చాలాకాలంగా తెలుగు హీరోలపై కన్నేశారని, టాలీవుడ్‌ హీరోలతో సినిమా చేయాలనుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీని పలుమార్లు కలిశారని రెండు, మూడు సిట్టింగ్‌లు జరిగాయని కథలు చెప్పారని టాక్‌ నడిచింది. అయితే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పేర్లు వినిపించాయి. అయితే ఎవరితోనూ వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు ఆయన దృష్టి మహేశ్‌ బాబుపై (Mahesh Babu) పడిందని తెలిసింది. భన్సాలీ ప్రయత్నాలు చూస్తుంటే తెలుగులో టాప్‌ హీరోలతో సినిమా చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతోంది. ఇప్పటికే ఓసారి మహేశ్‌ను కలిశారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ నడుస్తోంది. కథ విన్నారా? నచ్చిందా? లేదా అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం మహేష్‌ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన ఫోకస్‌ అంతా ఆ సినిమా ఈమదే ఉంది. అది పూర్తయ్యే వరకూ తదుపరి ప్రాజెక్ట్‌ గురించి కంగారు పడే అవకాశం లేదు. ఈ చిత్రం పూర్తయ్యే వరకూ తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భన్సాలీ మాత్రం ఓ విషయంలో క్లారిటీగా ఉన్నారు. స్టార్‌ హీరోలతో సినిమా చేయాలనుకుంటున్నారు.. కలుస్తున్నారు.. కథలు చెబుతున్నారు. కానీ కంగారు పడటం లేదు. సినిమా చేయాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. బాలీవుడ్‌లో గొప్పగొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు టాలీవుడ్‌ హీరోలతో సినిమా చేయాలనుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ఈ మధ్యకాలంలో మన హీరోలు కూడా కంగారుపడటం లేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అలాగే భన్సాలీ కూడా ఓపికగా ఉంటున్నారు. ఆయనకు కావలసింది స్టార్‌ కాదు.. ఆయన కథలో పూర్తిగా ప్రయాణం చేసే నటుడు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి మహేశ్‌పై ఉంది కాబట్టి.. ఆయన ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిందే!   

Updated Date - Sep 15 , 2026 | 03:56 PM